
కొందరు ఐఆర్‌ఎస్, ఐఎఫ్‌ఎస్‌లు కూడా..
వెయిటింగ్‌లో ఉన్న పలువురికి పోస్టింగ్‌లు
బదిలీ అయిన కొందరికి వేరుగా పోస్టింగ్ ఉత్తర్వులు
ఉత్తర్వులు జారీచేసిన సీఎస్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పెద్దఎత్తున అఖిల భారత సర్వీసు అధికారులను (ఐఏఎస్, ఐఆర్‌ఎస్, ఐఎఫ్‌ఎస్) ప్రభుత్వం బదిలీ చేసింది. వెయిటింగ్‌లో ఉన్న వారికి పోస్టింగ్‌లు ఇచ్చిoది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
బదిలీ చేసిన వారిలో కొంతమందికి పోస్టింగ్‌లు ఇవ్వలేదు. వారికి వేరుగా పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొన్నారు. పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్న కేవీఎన్ చక్రధర్‌బాబును సెకండరీ హెల్త్ డైరెక్టర్‌గా నియమించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీరావును పౌర సరఫరాల సంస్థ ఎండీగా బదిలీ చేశారు.
