
అధికి బరువు సమస్యకు చెక్‌పెట్టేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని ఎంచుకుని సత్ఫలితాలు పొంది మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. భారంగా ఉండే సమస్యకు చాలామంది ఆరోగ్యకరమైన విధానానికే మద్దతిస్తుండటం విశేషం. షార్ట్‌కట్‌లు, ఔషధాలతో కాకుండా శారీరక శ్రమ, ఓపిక, క్రమశిక్షణ అనే ఆయుధాలతో బరువుని కరిగిస్తున్నారు..స్లిమ్‌గా మారుతున్నారు. అలాంటి కోవలోకి అక్షయ్ కక్కర్ అనే ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా చేరిపోయాడు. పైగా గతేడాది గణేష్ చుతర్థికి ఈ ఏడాది గణేష్ చతుర్థికి తనలో భారీగా సంతరించుకున్న మార్పుని సోషల్‌మీడియా వేదికగా షేర్ చేయడమే గాక అంతలా బరువు తగ్గేందుకు ఉపకరించిన ట్రిక్స్‌ని కూడా చేసుకున్నారు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అక్షయ్ కక్కర్(Akshay Kakkar) వెయిట్‌లాస్(Weight loss) జర్నీ ఏవిధంగా నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. అసాధారణమైన తన అధిక బరువుని తగ్గించేందుకు ఎంతలా కష్టపడింది వివరించారు. ఏకంగా 179 కిలోలు పైనే బరువు ఉండే అక్షయ్ కేవలం ఒక్క ఏడాదికే ఊహించనంతంగా బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంటే సుమారు 44 కిలోలు పైనే బరువు తగ్గాడు.
శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఆరోగ్యవంతమైన మార్పుని అందుకున్నాడు. అందుకోసం తనకు క్రమశిక్షణ, సహనం, అచంచలమైన నమ్మకమే ఉపకరించాయని చెబుతున్నాడు అక్షయ్. "అంతేగాదు తన వెయిట్ లాస్ జర్నీకి గతేడాది వినాయక చవితికి..ఈ ఏడాది పండుగకి ఎంతో వ్యత్సాసం ఉంది. ఈ మార్పు నా జీవితంలో అదిపెద్ద బహుమతి. దీని వెనుక ఎంతో శ్రమ, చిందించిన చెమట, పోరాటం ఉన్నాయి. ఈ మార్పుకి ఎంతో సంతోషంగా ఉంది. గణపతి బప్పా నిజంగా అందరికి మంచి చేస్తాడు." అనే క్యాప్షన్ జోడించి మరి తన వెయిట్ లాస్ జర్నీ గురించి వివరించాడు.
ఎలాంటి డైట్, వ్యాయామాలు చేశాడంటే..
తాను ఎలాంటి షార్ట్ కర్ట్‌లు అనుకరించలేదని అన్నారు. మైండ్‌ఫుల్‌నెస్‌గా తినడం, సముతుల్యంగా తినేలా జాగ్రత్త తీసుకోవడం, వంటి వాటి తోపాటు రుచికరమైన ఆహారాన్ని వదులుకోలేదని చెబుతున్నాడు. తన ప్లేట్‌లో సలాడ్, ప్రోటీన్ ప్యాక్, కూరగాయలు, పిండి పదార్థాల కోసం పప్పు, రోటీ, కరకరలాడే పాపడ్ వంటి ఉన్నాయని చెప్పారు. బరువు తగ్గడం నచ్చిన ఆహారం వదిలిపెట్టడం కాదు సరిగ్గా తినడం, సమతుల్యతకు ప్రాధాన్యత ఇవ్వడం అని చెబుతున్నాడు.
దాంతోపాటు కార్డియో వ్యాయామాలు..ముచ్చెమటలు పట్టేలా చేసి త్వరితగతిన బరువు తగ్గేందుకు ఉపయోగపడ్డాయని చెప్పారు. అలాగే యోగా కూడా బరువు తగ్గడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని అంటున్నాడు. ఇది మానసికంగా బరువు తగ్గేలా బలోపేతం చేస్తుందని చెబుతున్నాడు. కేలరీలు తగ్గేందుకు కార్డియో అద్భుతమైన మ్యాజిక్ చేస్తుందని చెబుతున్నాడు.
వర్కౌట్లను మన శరీరాన్ని మంచిగా మార్చే వైద్య ప్రక్రియగా భావిస్తే..భారంగా అనిపించిందని అంటున్నాడు. అలా తను ఒక్క ఏడాదిలోనే 179 కిలోలు నుంచి 139 కిలోలకు వచ్చినట్లు తెలిపాడు. ఇక్కడ కేవలం బరువు తగ్గేందుకు ధైర్యంగా ముందడుగు వేయడం, మైండ్‌ఫుల్‌నెస్‌గా తినడం, ఓపిక, ఒక యోగా భంగిమ..అద్భుతమే చేస్తాయని నమ్మకంగా చెబుతున్నాడు అక్షయ్ కక్కర్.
(చదవండి: ఆహారంలో వాపుని ఆపుదాం..! ఫుడ్ ఫర్ ఇన్‌ఫ్లమేషన్..)