
శరత్ సిటీ మాల్లో వర్థమాన నటి సందడి
దేశంలో అగ్రగామి ఇన్ఫ్లుయెన్సర్ అయిన వర్థమాన నటి నిహారిక ఎన్‌ఎం (Niharika NM) హైదరాబాద్ నగరంలోని శరత్ సిటీ మాల్లో ఆదివారం సందడి చేశారు. ప్రస్తుతం ‘మిత్ర మండలి’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు మరికొద్ది రోజుల్లో రానున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రాండెడ్ ఫుట్ వేర్ బాటా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సంస్థ తన కొత్త కలెక్షన్‌లో భాగంగా ‘బ్రైటర్ మూమెంట్స్’ పేరుతో కొత్త ప్రొడక్ట్‌ను శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో (Sarath City Capital Mall ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటరాక్టివ్ గేమ్స్, పండుగ పోటీలు నిహారిక ఉత్సాహంగా పాల్గొన్నారు. అభిమానులతో సెల్పీలు దిగుతూ మీట్–అండ్–గ్రీట్ (Meet and Greet) కార్యక్రమంలో పాల్గొన్నారు.
చదవండి: ముద్దుల కోడలితో నీతా అంబానీ.. బుల్లి బ్యాగ్ ధర ఎన్ని కోట్లో తెలుసా?