
బరువు తగ్గాలంటే చాలా కష్టం అని భావిస్తున్నారా? అంత భయపడాల్సిన అవసరం లేదు అంటూ చాలా మంది ఇన్‌ఫ్లూయెన్సర్లు చాలా పకడ్బందీగా బరువుతగ్గి చూపిస్తున్నారు. ఖరీదైన జిమ్ సభ్యత్వం ఫ్యాన్సీడైటింగ్‌లేకుండా ప్రణాళికా బద్దంగా ప్రయత్నిస్తూ.. కాస్త ఓపిక పడితే వెయిట్ లాస్ అవ్వడం ఈజీనే అంటున్నారు. అలాంటి వారిలో ఒకరు మన తెలుసుకోబోతున్న కంటెంట్ క్రియేటర్. కఠినమైన ఆహార పద్ధతులు, తీవ్రమైన కసరత్తులు కాకుండా చక్కటి జీవనశైలి, మంచి ఆహార అలవాట్లతో బరువు తగ్గిన వైనాన్ని సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది.
కంటెంట్ క్రియేటర్ యామిని అగర్వాల్ 8 నెలల్లో 20 కిలోలు తగ్గినట్టు తెలిపింది. యామిని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తన వెయిట్ లాస్ జర్నీ, వ్యాయామాలను కూడా వివరించింది: ఎక్కువ ఉపవాసాలు కఠినమైన వ్యాయామాలత ఫలితంగా స్వల్పకాలికంగా ఉండవచ్చు. కానీ నిజంగా పట్టుదలగా కొన్ని ఆహార అలవాట్లు, వెయిట్ ట్రెయినంగ్ స్థిరంగా బరువు తగ్గవచ్చని యామిని చెబుతోంది.
ఆ క్రమంలో యామిని హోమ్ వర్కౌట్‌లనే ఎక్కువగా పాటించింది. అదీ క్రమం తప్పకుండా అనుసరించింది. 4 రోజుల బరువు శిక్షణ, 2 రోజుల కార్డియో ఒక రోజు రెస్ట్ అనేపద్ధతిని పాటించింది. అంతేకాదు ఈ రోజుల్లోఆర్మ్స్ డే, లెగ్స్ డే, అంటూ స్మార్ట్ స్ప్లిట్‌ను పాటించింది. సోమవారం కాళ్లకు,మంగళవారం యాబ్స్, బుధవారం చేతులకు వ్యాయామాలను కేటాయించింది. గురువారం వీపు , భుజాల కండరాలను బలోపేతం చేసేలా తన వ్యాయామాన్ని ప్లాన్ చేసింది. అలా స్థిరమైన ప్రణాళిక, సాధారణ వ్యాయామాలుచేస్తూ తన వెయిట్ లాస్‌ను ట్రాక్ చేసుకుంది.
యామిని చిట్కా
యామిని పంచుకున్న ఒక ముఖ్యమైన చిట్కాను కూడా షేర్ చేసింది. వ్యాయామం చేస్తున్నప్పుడు తన వీడియోలను రికార్డ్ చేయడం ద్వారా తాను చేస్తున్న తప్పులను గమనించింది.ఎక్కడ తప్పు జరుగుతోందో గమనించి దాన్ని సరిదిద్దు కుంటూ ముందుకు సాగాననీ, ఇది తన వెయిట్ లాస్ జర్నీలో మరిన్ని కొలోల బరువు తగ్గేందుకు ఉపయోగపడిందని చెప్పుకొచ్చింది.