
దసరా అయిపోయింది..దీపావళి పండుగ సన్నాహాలు మొదలైపోయాయి. దీపాల పండుగ వచ్చేస్తుందటంట..వణికించే చలి మొదలైపోతుంది. సరదాగా అనిపించినా.. ఈ కాలంలో ఆహరం, ఆరోగ్యం రెండూ జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. అంతేగాదు రైతులు కూడా ఈ అధిక చలికారణంగా నష్టాలను చవిచూస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల నుంచి సేఫ్‌గా ఉండాలంటే..మరీ ఏడాది చలి ప్రభావం ఏ రేంజ్‌లో ఉందో ముందుగానే తెలుసుకుందామా..!.
వాతావరణ శాస్త్రవేత్తలు ఈ ఏడాది భారత్ అత్యంత శీతల శీతకాలన్ని చవిచూడనుందని పేర్కొన్నారు. భారత వాతావరణ శాఖ సైతం ఈ ఏడాదిలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు, తరుచుగా చలి గాలులు, భారీ హిమపాతం వంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఈవిధమైన వాతావరణ మార్పు ప్రపంచ వాతావరణ వ్యవస్థలను దెబ్బతీస్తుందని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. ఇప్పటికే జమ్ము కాశ్మీర్‌లోని సింథాన్ వంటి ప్రాంతాలన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి. ఇక ఇండో గంగా మైదానాల్లోకి చొచ్చుకుపోతున్న చల్లని గాలి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలను ప్రభావితం చేస్తుందని నిపుణులు అంచనా వేశారు.
అలాగే వాతావరణ ఉష్ణోగ్రతలు తరుచుగా మార్పులు చోటుచేసుకుంటాయని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీలో సీనియర్ క్లైమాటాలజిస్ట్ డాక్టర్ రీతు శర్మ అన్నారు. ఈ ముందస్తు శీతాకాలపు సూచన ముఖ్యంగా వ్యవసాయం, ప్రజారోగ్యం వాటికి సంబంధించి మెరుగైన సంసిద్ధతకు మేల్కొలుపుగా పేర్కొన్నారు.
ఈ ఏడాది రైతులకు అధిక శీతగాలుల కారణంగా గోధుమ, ఆవాలు వంటి రబీ పంటలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. అలాగే ఆరోగ్యపరంగా.. శ్వాసకోస వ్యాధులు, ఫ్లూ వ్యాధులు ప్రబలంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నందున ఈ వాతావరణ మార్పు, ఆహార భద్రత ఒకదానిపై ఒకటి ఎలా ఆధారపుడుతున్నాయో హైలెట్ చేశారు.
అలాగే ఈ ముదస్తు వాతావరణ హెచ్చరికతో ఎలాంటి వ్యవసాయానికి పెట్టుబడి పెడితే మంచిదనేది నిర్ణయించొచ్చని ఎఫ్‌ఏఓ ప్రతినిధి ప్రియామీనన్ అన్నారు. అలాగే చలికాలం సమీపిస్తున్నందున ప్రజలంతా తమ నిత్యావసరాలను అనువైన విధంగా నిల్వ చేసుకోవడం తోపాటు అనారోగ్యం బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నిపుణులు.
(చదవండి: Success Story: ఆఫీస్ బాయ్ నుంచి సీఈవో రేంజ్‌కి..! ఏకంగా డిజైన్ దిగ్గజం కాన్వాతో..)