
బరువు తగ్గడం అంత ఈజీ టాస్క్ కాదు. నిబద్ధత, స్థిరమైన మైండ్‌సెట్ ఉంటేనే అనకున్న లక్ష్యాన్ని చేధించి బరువు తగ్గగలం. లేదంటే కష్టమే. అందులోనూ పిల్లల్ని కన్న తల్లులకు బరువు తగ్గడం మరింత క్రిటికల్ టాస్క్. ఓపక్క ఇంటి బాధ్యతలు, మరోవైపు కెరీర్ చూసుకుంటూ..వ్యక్తిగతంగా సమయం కేటాయింటం అంటే మాములు విషయం కాదు. అయినప్పటికీ..అన్నింటిని అధిగమించి బరువు తగ్గడంలో మంచి సక్సెస్ అందుకుంది ఈ పిల్లల తల్లి. అందుకోసం తానేం ఏం చేసిందో, తనకు హెల్ప్ అయిన చిట్కాలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారామె. అవేంటంటే..
డాక్టర్, ఎంటర్‌ప్రెన్యూర్ భావన ఆనంద్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన అనంతరం అధిక బరువుతో బాధపడుతుండేది. ఆమె 2022 ఆ టైంలో ఏకంగా 84 కిలోల మేర అధిక బరువు ఉండేది. అలాంటి ఆమె ఈ ఏడాది కల్లా స్మార్ట్‌గా మారడమేగాక విజయవంతంగా 56 కిలోలకు చేరుకుంది. అంతలా మారిపోయిన ఆమె లుక్‌ని చూసి ఆమె స్నేహితులు, సన్నిహితులు విస్తుపోయారు.
"ఆ మూడు అలవాట్లే తన జీవితాన్ని మార్చాయ్" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ తన వెయిట్ లాస్ జర్నీని నెట్టింట షేర్ చేసుకున్నారామె. ప్రతిరోజు నెమ్మది నెమ్మదిగా అడుగులు వేయండి అదే మీ శరీరంలో పెనుమార్పు తీసుకొస్తుందని నమ్మకంగా చెబుతోందామె.
27 కిలోలకు పైగా బరువు ఎలా తగ్గిందంటే..
ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు భావన ఆనంద్ వీడియోలో ఇలా చెప్పుకొచ్చింది. చాలామంది అలా ఎలా మారిపోయవని ప్రశ్నిస్తున్నారని, ఆ నేపథ్యంలోనే తాను ఫాలో అయ్యిన మూడు చిట్కాలను పంచుకుంటున్నా అంటూ చెప్పడం ప్రారంభించారామె. ఇదేం షార్ట్ కట్ కాదు. తన జీవనశైలిలో ఆ మూడు అలవాట్లను భాగం చేసుకోవడంతోనే తన జీవితం ఇంతలా మారిపోయిందని పేర్కొంది.
వ్యాయామ దినచర్యలో రెసిస్టెన్స్ శిక్షణ..
తాను చేసే వ్యాయామాలపై ఫోకస్ పెడతానంటోంది. కాలక్రమేణ అవి మంచి పురోగతిని సాధించడంలో హెల్ప్ అవుతాయని చెబుతోంది.
ప్రోటీన్-రిచ్ మీల్స్‌కి ప్రాధాన్యత..
ప్రతిరోజు ప్రోటీన్ ప్యాక్డ్ మీల్స్ తీసుకునేలా చూసుకుంటానంటోంది. ప్రోటీన్ రిచ్ వంటకాలు కండరాల పెరుగుదల, కోలుకోవడం, మొత్తం పోషకాహర సమతుల్యతకు అత్యంత ముఖ్యమైనవని నొక్కి చెబుతోంది.
సరైన నిద్ర..
తన వెయిట్ లాస్ జర్నీలో ఇది అసలైన గైమ్ ఛేంజర్ అని అంటోంది. రాత్రి త్వరగా భోజనం చేయడం, ఉదయాన్నే నిద్రలేవడం వల్ల శరీరానికి ఓ నిర్థిష్ట దినచర్యను అనుసరించేలా చేయగలుగుతాం. దాంతో అది సవ్యంగా పనిచేసేందుకు దారితీస్తుంది. బరువు తగ్గేందుకు హెల్ప్ అవుతుందని అంటోంది. తనకు ఈ వెయిట్‌లాస్ జర్నీలో ఆ మూడే బరువు తగ్గేందుకు ఉపకరించాయని వాటిని సక్రమంగా బ్యాలెన్స్ చేయగలిగితే ఎవ్వరైనా బరువు తగ్గడం సులభమేనని చెప్పుకొచ్చింది.
కాగా, గతంలో భావన ఆనంద్ తన మహిళా అనుచరులకు 30 ఏళ్ల తర్వాత కండరాల నష్టం కారణంగా కోల్పోయిన శక్తిని ఎలా తిరిగి పొందాలో మార్గనిర్దేశం చేసింది. హార్మోన్ల మార్పు వల్ల 30 ఏళ్ల దాటిని ప్రతి స్త్రీకి శరీరంలోని శక్తి సన్నగిల్లుతుందని, జీవక్రియ నెమ్మదిస్తుందని చెప్పుకొచ్చారు. దీన్ని మనం బల శిక్షణ, అధిక ప్రోటీన్ భోజనం, మంచి నిద్ర వంటి అమేజింగ్ అలవాట్లను జోడించి.. మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండని పిలుపునిస్తోంది డాక్టర్ భావన ఆనంద్.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: టెన్త్ ఫెయిల్యూర్ ఐపీఎస్ అధికారి స్టోరీ..! మూడుసార్లు ఫెయిల్.. పట్టువదలని విక్రమార్కుడులా..)