ధ్యానం ఇవాళ ఉరుకులు పరుగుల జీవితానికి అత్యంత అవసరం. పురాతన కాలంలో రుషులు ధ్యానాన్ని జ్ఞానోదయం కోసం ఒక సాధనంగా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు జీవితంలో ఎదురవ్వుతున్న ఒత్తిడి, ఆందోళన వంటి సవాళ్లను అధిగమించి మనశ్శాంతిని పొందే మార్గంగా మారింది. సమయం తక్కువగా ఉండి, చేయవలిసిన పని చాలా ఎక్కువగా ఉంటే ఒత్తిడి పెరుగుతుంది.
అటువంటి సమయంలో మన శరీరంలో శక్తి అంతా హరించుకుపోతుంది. ఒత్తిడిని ప్రేరేపించే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు అమాంతం పెరగకుండా తగ్గించడానికి ధ్యానం సమర్ధవంతంగా ఉంటుంది. పైగా శక్తివంతంగా చేస్తుంది. ఇది మన మానసిస్థితిని మెరుగుపరిచి, జీవితాన్ని ఆనందమయంగా చేస్తుంది. జీవితంలో ఎంత ఎక్కువ బాధ్యతలు ఉంటే అంత ఎక్కువ ధ్యానం అవసరం ఉంటుందని ధ్యాన నిపుణులు చెబుతున్నారు. మన లక్ష్యాలు, ఆశయాలు ఎంత ఎక్కువ ఉంటే ధ్యానం చేయాల్సిన అవసరం అంత ఎక్కువగా ఉంటుందట.
ఒత్తిడికి చక్కటి ఉపశమనం ధ్యానం. ధ్యానం అనేది శరీరానికి జీవననాడి, అలాగే మనసుకు మంచి శక్తిని అందిస్తుందని చెబుతున్నారు. ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే అంత ఎక్కువగా అప్రమత్తత, అవగాహన అంతగా మెరుగవ్వుతాయట. అంతేగాదు మనలో సృజనాత్మక శక్తి పెంచుతుందట. అందరిలోనూ నిస్తేజంగా ఉన్న ఈ క్రియేటివిటీ మేల్కోంటుందట. సామర్థ్యాన్ని పెంపొందించుకునే అవకాశం అందిస్తుందట.
అంతరంగంలో శాంతి లేకపోతే బాహ్య ప్రపంచం ప్రశాంతంగా ఉండదు. ధ్యానం అంతర్గత శక్తిని సుస్థిరం చేస్తుంది. తత్ఫలితంగా మనం స్ట్రాంగ్‌గా తయావ్వడమే కాకుండా ప్రతి పనిలో విజయాన్ని సునాయాసంగా అందుకోగలుగుతామని నమ్మకంగా చెబుతున్నారుని నిపుణులు. ఇది మానవ సంబంధాలను కూడా మెరుగుపరస్తుందట.
సమాయానుసారంగా ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో నేర్పుతుందట. గందరగోళంతో సతమతమవుతున్న మనసుకు ఊరట, అలాగే దుఃఖాన్ని అధిమించగలిగే శక్తిని అందిస్తుందని చెబుతున్నారు. మానసికంగా, శారీరకంగా బలోపేతం చేసే శక్తి ఒక్క ధ్యానంతోనే సాధ్యమని నొక్కి చెబుతున్నారు యోగా గురుశ్రీశ్రీ రవిశంకర్, పలువురు యోగా నిపుణులు. వయసుతో సంబంధం లేకుండా అందరికీ అవసరంమని వక్కాణిస్తున్నారు.
(చదవండి: ప్రపంచ శాంతి కోసం ధ్యానం..ఐక్యరాజ్యసమితిలో గురుదేవ్ ప్రసంగం)


