ఆ ప్యాలెస్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ఇంత ఖరీదా..? | Raffles Udaipur: Where PV Sindhu Got Married, A Suite Costs | Sakshi
Sakshi News home page

ఆ ప్యాలెస్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ఇంత ఖరీదా..? పీవీ సింధు ఏకంగా రూ. 7 లక్షలు..

Dec 22 2025 4:26 PM | Updated on Dec 22 2025 4:46 PM

Raffles Udaipur: Where PV Sindhu Got Married, A Suite Costs

డెస్టినేషన్‌ వివాహాలు గురించి తెలిసిందే. సంపన్నులు, సెలబ్రిటీలు, ప్రముఖులు ఇలాంటి విలాసవంతమైన వివాహాలు చేసుకుంటుంటారు. విలాసవంతమైన ప్యాలెస్‌లు, రాజుల కాలంనాటి ఫేమస్‌ భవనాల్లో అలనాటి చారిత్రక దర్పానికి తగ్గట్టు అంగరంగ వైభవవంగా వివాహాలు చేసుకుంటుంటారు. అలాంటి ప్రఖ్యాతిగాంచిన డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ భవంతులలో ఒకటి ఈ రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్‌. ఇక్కడ ఒక్క రాత్రికి బస ఎంత అవుతుందో తెలిస్తే కంగుతింటారు. 

ఈ ప్రముఖ రాజస్థాన్‌ ప్యాలెస్‌లో లగ్జరీ రిసార్ట్‌లు, వాటి హంగుఆర్భాటాలు పర్యాటకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి. ఇలాంటి ప్యాలెస్‌లలో పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా నుంచి వెంకట దత్త సాయి పివీ సింధు -నేత్ర మంతెన-వంశీ గదిరాజు వంటి ఎందరో జంటలు పెళ్లి బంధంతో ఇక్కడే ఒక్కటయ్యారు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా చారిత్రకనేపథ్యం ఉన్న  ఇలాంటి ప్యాలెస్‌లను ఎంచుకుంటారు చాలామంది జంటలు. ఈ డిసెంబర్‌22తో వెంకట దత్త సాయి పీవీ సింధుల దంపతులకు పెళ్లై ఏడాది అవుతున్న నేపథ్యంలో వారి వివాహానికి వేదిక అయిన ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌ విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా.

పీవీ సింధు రాఫెల్స్‌ ఉదయ్‌పూర్‌ సూట్‌లో వివాహం చేసుకున్నారు. యూరోపియన్ వాస్తుశిల్పాల మిశ్రమాన్ని కలిగి ఉన్న ఈ రిసార్ట్‌ తన కస్టమర్లకు మంచి ఆధునిక సౌకర్యాలను అందిస్తోంది. మహారాణా ప్రతాప్ విమానాశ్రయం నుంచి కేవలం 20 నిమిషాల దూరంలో ఉంటుంది ఈ ప్యాలెస్‌. ఇక్కడ ఉదయ్ సాగర్ సరస్సు మీదుగా పడవ ప్రయాణం అత్యంత ఆహ్లాదభరితంగా ఉంటుంది. 

దాని చుట్టూ ఉన్న పచ్చదనం చూపు మరల్చనివ్వని విధంగా కట్టిపడేస్తుంది. అలాగే భోజన ప్రియుల కోసం చక్కటి వంటకాల నిధిని, ఫిట్‌నెస్ ఔత్సాహికుల కోసం మంచి వెల్‌నెస్‌ చికిత్సలు, ఆయుర్వేద సెషన్‌ వంటి సకల సౌకర్యాలను అందిస్తుంది. ముఖ్యంగా మౌంటైన్‌ బైకింగ్‌, వాల్ క్లైంబింగ్, షూటింగ్, ఆర్చరీ తదితర ఎన్నో వినోదాలను నిలయం. దాదాపు 21 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ ప్యాలస్‌ మర్చిపోలేని మధురానుభూతిని పంచి ఇస్తుందని అక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాదండోయ్‌ పురాతనమైన మహాదేవ్ ఆలయాన్ని సందర్శించడం కోసం ట్రెక్కింగ్‌ అనుభవాన్ని కూడా అందిస్తుందట.

'స్టే' చేయడానికి అయ్యే ఖర్చు..
పీవీ సింధు-వెంకటసాయి దత్త రాఫెల్స్ ప్రెసిడెన్షియల్ సూట్‌ని బుక్‌ చేసుకున్నారు. అది ఏకంగా దగ్గర దగ్గర ఒక్క రాత్రికి బస రూ. 7 లక్షలు పైనే అవుతుందట. ఇంత లగ్జరీలోనే కాదు ఓ మోస్తారు ధరలో లభించే రిసార్టుల కూడా ఉన్నాయట.

లేక్‌షోర్ సిగ్నేచర్ - ద్వీపంలో లేని గది, రాత్రికి రూ. 57,000
ఫ్లెమింగో సిగ్నేచర్ రూమ్, తోటతో పాటు, ట్విన్ లేదా కింగ్ బెడ్‌తో, రాత్రికి రూ. 77,000
ఫ్లెమింగో సిగ్నేచర్ రూమ్, బాల్కనీతో పాటు, ట్విన్ లేదా కింగ్ బెడ్‌తో, రాత్రికి రూ. 81,000
ఫ్లెమింగో సిగ్నేచర్ రూమ్, ప్లంజ్ పూల్‌తో పాటు, ట్విన్ లేదా కింగ్ బెడ్‌తో, రాత్రికి రూ. 87,000
రాఫెల్స్ లేక్‌షోర్ మనోర్ - ద్వీపంలో లేని రిసార్ట్‌, రాత్రికి రూ. 97,000
రాఫెల్స్ మనోర్ సూట్, రాత్రికి రూ. 1,17,000
రాఫెల్స్ ఒయాసిస్ సూట్, రాత్రికి రూ. 1,37,000
రాఫెల్స్ ప్రెసిడెన్షియల్ సూట్, రాత్రికి రూ. 7,57,000
అయితే, బుకింగ్ తేదీని అనుసరించి గదులు, సూట్ల లభ్యతలో ధరలు మార్పు ఉంటుందట.

 

(చదవండి: Worlds Most Expensive Saree: అత్యంత ఖరీదైన 'పట్టుచీర'..! ఆద్యంతం ఆసక్తికరం..అద్భుతం..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement