
టెస్లా అధినేత, టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అపర కుభేరుడు, ఎలాన్ మస్క్ వ్యవస్థపక విజయాలన్నీ..కొత్త వ్యాపారం చేయాలనుకునేవారికి మార్గదర్శకం. అలాంటి టెక్ దిగ్గజం ఒక 'బేకరీ'ని కూడా నడుపుతున్నట్లు మీకు తెలుసా..!. అయితే ఆ బేకరీలో కేక్‌లు, పేస్ట్రీలు, బ్రెడ్‌లు ఉండవు ఉండవు. మరీ ఏం తయారవుతాయంటే..
ఈ బేకరీ స్టార్‌షిప్ అంతరిక్ష నౌకలో ఉపయోగించే సిరామిక్ హీట్ షీల్డ్ టైల్స్ తయారు చేస్తుంది. చలా జాగ్రత్తగా రూపొందించే ఈ టైల్స్ పదునైన షడ్భుజాకారాల్లో ఉంటాయి. అవి భూమి వాతావరణంలోకి ప్రవేశించగానే మండే ఉష్ణోగ్రతలో అంతరిక్ష నౌకను రక్షిస్తాయి. వీటి ష్ణోగ్రతలో కొన్నిసార్లు 1,400 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంటుందట.
ఆ నేపథ్యంలోనే వీటికి ప్రత్యేకమైన డిజైన్ ఉంది. ఇందులో సంక్లిష్టమైన పిన్ అటాచ్‌మెంట్‌లు, చిన్న విస్తరణ అంతరాలు ఉంటాయి. ఇవి పగుళ్లు లేకుండా వంగడానికి, స్వీకరించడానికి వీలు కల్పిస్తాయి. ప్రతి స్టార్‌షిప్‌కు 18,000 షడ్భుజాకార టైల్స్ అవసరం. ఇవి నల్లటి బోరోసిలికేట్ గాజుతో పొరలుగా ఉన్న అధునాతన సిలికా-ఆధారిత సిరామిక్స్‌తో నిర్మిస్తారు. దీనిలో వేసే ముడి పదార్థం నుంచి తుది ఉత్పత్తికి చేరుకునే ప్రక్రియకు సుమారు 40 గంటలు పైనే పడుతుందట. ఈ బేకరీ ప్రతిరోజు వేలాది టైల్స్‌ని ఉత్పత్తి చేస్తుంది.
ఆ పేరే ఎందుకంటే..
ఇక్కడ టైల్స్ కఠినమైన బేకింగ ప్రక్రియకు లోనవ్వుతాయి కాబట్టి. బ్రెడ్‌ను తయారు చేసినట్లుగానే ఈ ప్రత్యేకమైన టైల్స్‌ని అధిక ఉష్ణోగ్రత వద్ద సంపూర్ణ ఏకరీతి నిర్మాణాంలోకి వచ్చేలా చేస్తారు. ఇదంతా ఎందుకంటే.. అంతలా చేస్తేనే అంతరిక్ష ప్రయాణాన్ని సరసమైన ధరలో లభించేలా చేసేందుకు దోహదపడుతుంది
ఇది ఎలాన్ మస్క్ కలల వెంచర్. అలాగే ఈ స్టార్‌షిప్‌ని ఇంతల బేక్ చేయడం వల్లే చంద్రుడు, భూమి, అంగారక గ్రహాలపై బహుళ రీ ఎంట్రీలు, ల్యాండింగ్‌లు నావిగేట్ చేసేటప్పుడూ తీవ్ర ఉష్ణోగ్రతలను ఈజీగా తట్టుకుంటుందట.
Our fully automated bakery in Florida is setup to produce thousands of heat shield tiles per day to outfit the coming fleet of Starship vehicles pic.twitter.com/9Ki278wakx
— SpaceX (@SpaceX) October 13, 2025
(చదవండి: తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో సక్సెస్..కానీ ఐఏఎస్ వద్దని..)