breaking news
care taker
-
దేశంలోనే తొలి మహిళా మావటి..!
సాధారణంగా గజరాజులను మచ్చిక చేసుకునేది మగవారే. ఆ వృత్తిలో కొనసాగేది కూడా పురుషులే. కానీ అలాంటి వృతిలో ఓ మహిళ కొనసాగడమే గాక, ఎన్నో ఏగులను సంరక్షించి ఎన్నో అవార్డులే కాదు, రాష్ట్రపతిచే సత్కారం కూడా పొందారామె. అంతేగాదు ఆమెను హస్తి కన్య లేదా ఏనుగుల కుమార్తె అని కూడా పిలుస్తారు. ఇంతకీ ఎవరా మహిళ అంటే..ఆమె దేశంలోనే తొలి మహిళా మావటి. ఏనుగులను మచ్చిక చేసుకోవడంలో ఆమెకు సాటిలేరెవ్వరూ. ఆమెనే అస్సాంకు చెందని పర్బతి బారువా. ఐదు దశాబ్దాలకు పైగా తన జీవితాన్ని ఏనుగులను మచ్చిక చేసుకోవడానికి, సంరక్షించడానికి అంకితం చేసింది. చారిత్రాత్మకంగా పురుషులే కొనసాగుతున్న వృత్తిలోకి వచ్చి సత్తా చాటడమే గాక ఏళ్లనాటి మూసధోరణిని చేధించారామె. మహిళ మావాటిగా ఆమె ప్రస్థానం కేవలం అసామాన్య ధైర్యసాహాసాలకు సంబంధించినదే కాదు, ఏనుగుల పట్ల భారతదేశానికి ఉన్న లోతైన సాంస్కృతిక సంబంధాన్ని ఆధ్యాత్మిక గౌరవానికి, జ్ఞానానికి చిహ్నం కూడా.ఆమె ఈ రంగంలోకి ఎలా వచ్చిందంటే..మార్చి 14, 1953న అస్సాంలోని గౌరీపూర్ రాజకుటుంబంలో జన్మించిన పర్బతి. గౌరీపూర్ చివరి పాలకుడు దివంగత ప్రకృతిష్ చంద్ర బారువా కుమార్తె. ఆమె తండ్రి వేటగాడు, ఏనుగులను మచ్చిక చేసుకోవడంలో మంచి నిపుణుడు కూడా. అలా ఆమెకు ఏనుగులను మచ్చిక చేసుకోవడం వంశపారంపర్యంగా అబ్బిన విద్యగా పేర్కొనవచ్చు. ఆమె గౌహతి విశ్వవిద్యాలయం నుంచి పాలిటిక్స్‌లో గ్రాడ్యుయేట్ కూడా. అయినా ఆమె అటు విద్యారంగం, ఇటు ప్రజాసేవను కాకుండా వంశపారంపర్య అభిరుచి వైపుకే మగ్గడం విశేషం.14 ఏళ్లకే ఆ నైపుణ్యం..ఇక పర్బతి 14 ఏళ్ల ప్రాయంలోనే అస్సాంలోని కొచుగావ్ అడవి ఏనుగును మంచిక చేసుకుని దాని బాగోగులు చూసుకునేది. అలా 1975 నుంచి 1978 వరకు సంప్రదాయ అస్సామీ టెక్నిక్ షికార్ని ఉపయోగించి ఏకంగా 14 అడవి ఏనుగులను విజయవంతంగా మచ్చిక చేసుకుందామె. ఇక్కడ ఏనుగులను ట్రాంక్విలైజర్లతో అపస్మారక స్థితికి తీసుకువచ్చి మచ్చిక చేసుకోరు. లాస్సో పద్ధతిలో ఒక విధమైన తాడుతో బంధించి మచ్చిక చేసుకుంటారు.మచ్చిక చేయడం, కేర్‌టేకర్‌గా..అలా ఆమె అస్సాం, పశ్చిమ ెబెంగాల్, కేరళ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అటవీ శాఖలతో పనిచేసింది. అక్కడ మవాటిగా ఏనుగులకు శిక్షణ ఇవ్వడం ామానవులు-ఏనుగుల సంఘర్షణకు అడ్డుకట్ట వేయడం, గాయపడిన ఏనుగులు లేదా అనారోగ్యంతో ఉన్న ఏనుగులకు ఔషధ మూలికలతో చికిత్స అందించడంలో ఆమెకు మంచి నైపుణ్యం ఉంది. అయితే ఓ ఇంటర్వ్యూలో ఏనుగులు మానవులకంటే మంచివా అని ప్రశ్నించగా..నూటికి నూరు శాతం ఏనుగులే మంచివని నిర్మొహమాటంగా చెప్పేశారామె. అవి కూడా మానవుల మాదిరిగానే ప్రత్యేక మనస్తత్వంతో ఉంటాయట. కొన్ని అత్యంత సహనంగా, మరికొన్ని తెలివిగా, లీడర్లుగా ఉంటాయట. వాటి సహనం హద్దు దాటిపోతేనే విజృంభిస్తాయట. అవి తమ పిల్లలను అమితంగా ప్రేమిస్తాయని, ఎట్టిపరిస్థితుల్లోనూ హాని చేయదని అన్నారామె.అంతర్జాతీయంగా ఆమె సేవలు..ఆమె నైపుణ్యాలు, సేవలు అంతర్జాతీయంగా కూడా ప్రదర్శించాల్సి వచ్చింది. ఆమె 2001లో బ్యాంకాక్ నుంచి తమిళనాడు, జల్దపారా, ఉత్తర బెంగాల్‌లోని వర్క్‌షాప్‌ల వరకు ఏనుగులపై ప్రపంచ సమావేశాలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అలాగే ఆసియాటిక్ ఏనుగుల స్థితిపై పరిశోధనకుగానూ సహాయసహకారాలు అందించింది. ఆమె ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) ఆసియన్ ఎలిఫెంట్ స్పెషలిస్ట్ గ్రూప్‌లో సభ్యురాలిగా కూడా పనిచేశారు.సత్కారాలు, అవార్డులు..ఆమె అవిశ్రాంత కృషికి, పర్బతి బారువాను అనేక అవార్డులతో సత్కరించింది భారత ప్రభుత్వం. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) నుంచి గ్లోబల్ 500 రోల్ ఆఫ్ ఆనర్ (1989).అస్సాం ప్రభుత్వం ప్రదానం చేసే గౌరవ చీఫ్ ఎలిఫెంట్ వార్డెన్ ఆఫ్ అస్సాం (2003).అస్సాం అత్యున్నత పౌర గౌరవం అసోం గౌరవ్ అవార్డు (2023) నేచర్స్ వారియర్ జ్యూరీ అవార్డు (2023)తో సహా వన్యప్రాణులు, పరిరక్షణ సమూహాలకు సంబంధించిన జీవితకాల సాధన గుర్తింపులు.2024లో పర్బతి ఏనుగుల సంక్షేమానికి ఆమె చేసిన కృషికి గాను భారత అత్యున్నత పురస్కారం పద్మశ్రీతో సత్కరించారు.(చదవండి: Weight loss story: మైండ్‌ఫుల్‌నెస్‌గా తినడం, ఒక యోగా భంగిమ అద్భుతం చేశాయ్..!) -
రూమ్, ఫుడ్ ఉచితం, మంచి జీతం.. జాబ్ ఏంటని తెలిస్తే షాక్ అవుతారు!
‘పిల్లిని చూసుకోవడానికి ఆయా కావలెను’ అనే ప్రకటన కొద్దిరోజులుగా ఆస్ట్రేలియాలో వైరల్‌గా మారింది. సిడ్నీ నగరం తూర్పు శివారు ప్రాంతంలో ఒక భారీ భవంతిలో ఉంటున్న సంపన్న దంపతులు ఒక పిల్లిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. భార్యా భర్తలిద్దరూ పనుల్లో తలమునకలుగా ఉండేవారే కావడంతో ఇద్దరూ ఇంట్లో లేనప్పుడు పిల్లి బాగోగులు చూసుకోవడం వారికి ఇబ్బందిగా ఉంటోంది. అందువల్ల తమ పిల్లికి ఆయాగా ఉండేందుకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్థానిక పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. ఈ ఉద్యోగంలో చేరేవారికి తాము ఉంటున్న భవంతిలోనే సకల సౌకర్యాలతో కూడిన విశాలమైన గది, ఉచిత భోజనంతో పాటు తగిన జీతం కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సిడ్నీ నగరంలో ఇళ్ల అద్దెలు కళ్లుచెదిరే రీతిలో ఉంటాయి. సామాన్యమైన ఉద్యోగాలు చేసుకునేవారు అద్దెలు భరించలేక హాస్టళ్లలో ఉంటూ నెట్టుకొస్తుంటారు. చక్కని వసతితో కూడిన ఉద్యోగం కావడంతో పిల్లికి ఆయాగా ఉండటానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. చదవండి: పొగ తాగడం మానేసిన 20 నిమిషాల్లోనే ఎన్నెన్నో లాభాలు.. ఒక్కసారి ట్రై చేయండి -
కేర్‌టేకర్ దాష్టీకం.. చిన్నారి బ్రేన్పై ఎఫెక్ట్!
పసి పిల్లల ఆలనా, పాలనా చూసుకోమని కేర్ టేకర్‌ని పెట్టుకుంటే సదరు మహిళ ఆ చిన్నారుల్ని చిత్రహింసలకు గురి చేసింది. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పాలన్పూర్ పాటియా హిమగిరి సొసైటీలో నివాసముంటున్న ఓ దంపతులకు కవల పిల్లలు ఉన్నారు. తమ ఉద్యోగం కారణంగా వారిని చూసుకోవడానికి కోమల్ తంద్లేకర్ అనే మహిళను కేర్ టేకర్‌గా నియమించుకున్నారు. అయితే సదరు మహిళ ఓ రోజు ఆ కవలల్లో ఒకరిపై తన శాడిజమ్ ప్రదర్శించింది. ఒక బిడ్డను చెవులు మెలిపెట్టడంతో పాటు చెంపలపై కొట్టి, చేతి గోర్లను కొరకడమేగాక ఆ చిన్నారిని మంచంపై విసిరిపడేసింది. అలా ఓ ఐదు నిమిషాల పాటు కేర్‌టేకర్ పసికందును దారుణంగా కొట్టింది. ఇక ఆ దెబ్బలకు చిన్నారిలో కదలిక లేకపోవడంతో చేసేది లేక ఆ యువతి పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దాంతో చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ఆ దెబ్బలకు చిన్నారి తలలో మెదడు దెబ్బతిన్నట్లుగా వైద్యులు తెలిపారు. అయితే తమ ఇంట్లో అప్పటికే అమర్చి ఉన్న సీసీ ఫుటేజ్‌ని పరిశీలించడంతో కేర్‌టేకర్ చేసిన నిర్వాకం బయటపడింది. ఇక వెంటనే బాధిత చిన్నారుల తండ్రి మితేష్ పటేల్ కేర్ టేకర్‌పై రాందర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాంతో కేర్‌టేకర్ కోమల్ తంద్లేకర్పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
వైరల్: పిల్ల ఏనుగు చిలిపి చేష్టలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!
చిన్న పిల్లలు ఎంత అల్లరి చేసినా ముద్దుగానే ఉంటుంది. అందుకే వాటిని వీడియోలో బంధించి జ్ఞాపకంగా ఉంచుకుంటాం. అలానే కొన్ని జంతువులు చేసే చిలిపి చేష్టలు కూడా మనకి భలే సరదానిస్తాయి. ఇటీవల ఈ తరహా జంతువుల వీడియోలు అందులో ప్రత్యేకంగా ఏనుగులవి నెటిజన్లకు విపరీతంగా నచ్చుతున్నాయి. తాజాగా ఓ పిల్ల ఏనుగు తను సంరక్షుడిని ఆట పట్టించే వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఓ పిల్ల ఏనుగు కేర్ టేకర్ పని చేసుకుంటూ బిజీగా ఉంటాడు. పాపం మన బేబీ ఏనుగుకి ఆడుకోవడానికి ఎవరూ లేకపోవడంతో బోరు కొడుతుంది. అది ఎంటి మన మావటి వాడు మనల్ని పట్టించుకోవడం లేదని అనుకుంది. వెంటనే అతని వద్దకు వెళ్లి తొండంతో పిలుస్తుంది. అయితే మనోడు అదంతా పట్టించుకోకుండా తన పని ఏదో తాను చేసుకుంటూ ఉంటాడు. దీంతో అది హర్ట్ అయ్యి పిలుస్తుంటే పట్టించుకోవా అంటూ అతని చేస్తున్న పనిని డిస్ట్రబ్ చేస్తుంది. చివరకు ఆ కేర్ టేకర్ వెనక్కి తిరిగి దాన్ని సముదాయించే వరకు అది పసి పిల్లాడిలో ఓ రేంజ్లో అల్లరి చేసింది. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. So human.....we too cling to people we love and yearn for their love and attention ❤️❤️. #love #positivity #nature #Elephant @hvgoenka pic.twitter.com/B1q91jp6Vl — Tarana Hussain (@hussain_tarana) October 14, 2021 చదవండి: Viral Video: డ్యాన్స్ ఇరగదీసిన వధువు.. అంతా ఫిదా, అయితే వరుడు మాత్రం..! -
పది నెలల చిన్నారిపై ఆయా పైశాచికత్వం.. గుక్కపట్టి ఏడుస్తున్నా
కోల్‌కతా: ప్రస్తుతం భార్యభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తేనే.. జీవితం సాఫిగా సాగిపోతుంది. పెరుగుతున్న ఆర్థిక అవసరాలు, పిల్లల చదువు, వైద్యం వంటి ఖర్చులను దృష్టి పెట్టుకుని.. చాలా మంది ఆడవారు ఉద్యోగాలు చేస్తున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో చిన్నారుల ఆలనాపాలన విషయం ఉద్యోగం చేసే దంపతులను తీవ్రంగా కలిచి వేస్తుంది. ఇంట్లో పెద్దవారు ఉంటే పర్లేదు. కానీ బయట వ్యక్తుల మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడే సమస్య ఎదురవుతుంది. ఈ ఆయాల్లో కొందరు చిన్నారులనే కనికరం కూడా లేకుండా పిల్లలను హింసిస్తారు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. పశ్చిమ బెంగాల్ మిడ్నాపూర్‌కు చెందిన దంపతులు ఇద్దరు ఉద్యోగం చేస్తుంటారు. వారికి పది నెలల పాప ఉంది. ఇద్దరు జాబ్ చేస్తుండటంతో చిన్నారి ఆలనపాలన చూడటానికి ఓ ఆయాను నియమించుకున్నారు. మొదట్లో బాగానే ఉంది. కానీ రాను రాను చిన్నారి ప్రవర్తనలో మార్పు రాసాగింది. తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చాక చిన్నారి ఆయా దగ్గరకు వెళ్లడానికి నిరాకరించేది. ఆమెనే చూస్తేనే పాప బాగా ఏడ్చేది. (చదవండి: Viral: కుక్కలకు గొడుగు పట్టి.. మనుషులను దారిలో పెట్టి..) తల్లిదండ్రులకు ఆయా ప్రవర్తన మీద అనుమానం వచ్చింది. ఈ క్రమంలో వారు ఇంట్లో సీసీటీవీ పెట్టారు. ఆఫీస్‌కు వెళ్లాక.. అక్కడ నుంచి మానిటర్ చేసేవారు. ఇక సీసీటీవీలో కనిపించిన దృశ్యాలు వారిని భయభ్రాంతులకు గురి చేశాయి. ప్రాణం పోయినట్లు విలవిల్లాడారు. కారణం ఏంటంటే సదరు ఆయా ఏమాత్రం కనికరం లేకుండా పది నెలల చిన్నారిని.. దారుణంగా చితకబాదింది. పాప గుక్కపట్టి ఏడుస్తున్న ఆ రాక్షసి కనికరించలేదు. (చదవండి: Fact Check: డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ ఇలా ఉన్నాడేంటీ?) ఈ దృశ్యం చూసిన వెంటనే చిన్నారి తల్లిదండ్రులు వెంటనే ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో పోలీసులుకు ఫిర్యాదు చేసి.. వారిని వెంటపెట్టకుని ఇంటికి వచ్చారు. ఆయాను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చిన్నారిని మెడినిపూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చదవండి: అర్పిత.. స్ఫూర్తి ప్రదాత -
కోవిడ్ శవాలనూ, కొనఊపిరితో ఉన్నవారినీ వదల్లే
సాక్షి, గచ్చిబౌలి: గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో కోవిడ్ కేర్ టేకర్లుగా పనిచేసిన భార్యభర్తలు ఆ వృత్తికే కళంకం తెచ్చారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రోగులతో పాటు కోవిడ్‌తో చనిపోయిన వారి మృతదేహాల నుంచీ నగలు, సొత్తు కాజేశారు. మొత్తం ఏడు కేసులు నమోదైన ఉన్న వీళ్లని ఇలా చోరీ చేసిన సెల్‌ఫోన్ ఆధారంగానే గచ్చిబౌలి పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వర్లు పూర్తి వివరాలు వెల్లడించారు. 2017లో నాగర్‌కర్నూల్ జిల్లా ధర్మపురికి చెందిన చింతపల్లి రాజు, లతశ్రీ ప్రేమ వివాహం చేసుకుని కూకట్పల్లి రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్నారు. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజును సెకండ్ వేవ్ సమయంలో వైద్య సిబ్బంది జగద్గిరిగుట్ట నుంచి టిమ్స్‌కు తీసుకొచ్చేందుకు నియమించుకున్నారు. ఇలా ఏర్పడిన పరిచయాలతోనే తన భార్య లతశ్రీని టిమ్స్‌లో పేషెంట్ కేర్ టేకర్‌గా చేర్చాడు. కొన్నాళ్లకు రాజు కూడా అలాంటి ఉద్యోగంలోనే చేరాడు. అప్పుల్లో కూరుకుపోయిన వారి దృష్టి టిమ్స్‌లోని కోవిడ్ రోగులపై ఉన్న బంగారు ఆభరణాలపై పడింది. ఏప్రిల్ 17–మే 25 మధ్య ఏడు నేరాలు చేశారు. లతశ్రీ ముందుగా మృతదేహాలు ఉన్న చోటుకు వెళ్లి పరిశీలించేది. అక్కడ ఎవరూ లేకపోతే తన భర్త రాజును పిలిచేది. అక్కడకు వెళ్లే అతగాడు శవాలపై ఉన్న నగలు తీసి జేబులో వేసుకుని ఏమీ తెలియనట్లు డ్యూటీ చేసేవాడు. ఈ సొత్తును జగద్గిరిగుట్టలోని జగదాంబ జువెల్లర్స్‌లో కుదువ పెట్టి అప్పులు తీర్చడంతో పాటు జల్సాలు చేశారు. కేసు వివరాలను వెల్లడిస్తున్న మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు కోవిడ్‌తో మరణించిన ఉప్పరపల్లికి చెందిన ఉమాదేవి నుంచి మూడు తులాల బంగారు పుస్తెల తాడు, చెవి దిద్దులు, యూసూఫ్‌గూడకు చెందిన పరహత్ సుల్తానా ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారు గాజులు, దిద్దులు, జవహర్‌నగర్‌కు చెందిన భిక్షపతి తల్లి మెడలోంచి గుండ్ల మాల తస్కరించారు. నాచారానికి చెందిన కోటమ్మ ఐసీయూలో ఉండగానే ఆమె ఒంటిపై ఉన్న నాలుగు బంగారు గాజులు కాజేశారు. ఈమెను మరో హాస్పిటల్‌కు తరలిస్తుండగా ఈ విషయం గుర్తించారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే చివరి వారం నుంచి ఈ భార్యభర్తలు టిమ్స్‌లో డ్యూటీకి వెళ్లడం మానేశారు. ఓ మృతదేహం నుంచి వీళ్లు ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్ కూడా తస్కరించారు. ఇటీవల దీన్ని ఆన్ చేయడంతో పోలీసులకు క్లూ లభించి ఇద్దరూ చిక్కారు. విచారణలో తాము చేసిన నేరాలు అంగీకరించారు. వీరి నుంచి పది తులాల బంగారం సహా రూ.10 లక్షల విలువైన సొత్తు స్వాదీనం చేసుకున్నారు. మరో రెండు సంస్థల్లో తాకట్టు పెట్టిన నాలుగు బంగారు గాజులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. నిందితుల్ని పట్టుకున్న గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ గోనె సురేష్ తదితరుల్ని అభినందించిన డీసీపీ రివార్డు ప్రకటించారు. -
రెండేళ్లు నమ్మకంగా నటించి ముంచేశాడు
కేపీహెచ్‌బీకాలనీ: వృద్ధ దంపతులకు కేర్‌టేకర్‌గా ఉంటూ ఇంట్లోని రూ.7.80 లక్షల నగదును దొంగిలించిన వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం..కేపీహెచ్‌బీకాలనీ ఫేజ్–5కు చెందిన సూరపనేని మోహన్‌రావు (75) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తనకు కేర్ టేకర్‌గా కావాలని సైనిక్‌పురిలోని వీకేర్ ఏజెన్సీని సంప్రదించగా ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన మెరుగు శశికిరణ్‌ను నియమించారు. 2018 నుంచి మోహన్‌రావు ఇంట్లో పనిచేస్తున్న శశికిరణ్ వారితో నమ్మకంగా ఉన్నాడు. అప్పటికే ఆర్థిక ఇబ్బందులతో పాటు మద్యం, ఇతరత్రా వ్యసనాలకు బానిసైన శశికాంత్ కన్ను ఆ ఇంట్లో ఉన్న నగదుపై పడింది. మార్చి 28న మధ్యాహ్నం మోహన్‌రావు నిద్రలో ఉండగా బీరువాలోని రూ.7.80 లక్షల నగదును దొంగిలించి ఏమీ తెలియనట్లుగా వివిధ కారణాలతో తాను కేర్‌టేకర్ బాధ్యతలను నుంచి తప్పుకుంటున్నానని, చెప్పి మార్చి 28న మరో వ్యక్తిని నియమించి వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా మార్చి 30న మోహన్‌రావు సమీప బంధువు సీతారామస్వామికి డబ్బు అవసరం ఉండటంతో డబ్బు ఇచ్చేందుకు బీరువాను తెరిచి చూశాడు. బీరువాలో ఉండాల్సిన డబ్బు కనిపించలేదు. దీంతో శశికిరణ్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శశికిరణ్ సైనిక్‌పురిలోని వీకేర్ ఏజెన్సీకి సమీపంలో ఉన్నట్లుగా సమాచారం అందడంతో అక్కడికెళ్లి అదుపులోకి తీసుకున్నారు. రూ.1.05 లక్ష జల్సాకు వాడుకున్నట్లు నిందితుడు తెలిపాడు. శశికిరణ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. (చదవండి: ఈ కాలేజీలో చదవలేను.. సర్టిఫికెట్లు ఇస్తే ఇంటికెళ్లిపోతాను ) -
పోలీసులకు సోనమ్ కపూర్ బంధువు ఫిర్యాదు
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ బంధువు ప్రియా సింగ్ మూగ జీవాలను హింసించిన ఇద్దరూ జంతువుల కేర్ టేకర్స్‌పై ముంబైలోని మలబార్ హిల్ పోలీసు స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. గాయపడిన కుక్కలపై సదరు కేర్ టేకర్స్ విచక్షణ రహితంగా కర్రతో కొడుతూ పైశాచిక ఆనందం పొందుతున్న దృశ్యాలను చూసి ఆమె, తన భర్త భయపడ్డామని పోలీసులకు తెలిపారు. సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ప్రియ ఫిర్యాదు మేరకు పోలీసులు కేర్ టేకర్స్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాలు.. ప్రియా సింగ్ నెల రోజులుగా వికలాంగ జంతువులను సంరక్షించేందుకు సొంతంగా షెల్టర్ నిర్వహిస్తున్నారు. వాటిని చూసుకునేందుకు ఆమె ప్రకాష్ శామ్యూల్ బింగ్, రాంప్రాతాప్ పాస్వాన్ అనే ఇద్దరూ కేర్ టేకర్స్‌ను నియమించారు. ప్రస్తుతం వారి దగ్గర 4 కుక్కలు, 12 పిల్లులు ఉన్నాయి. ఈ క్రమంలో మంగళవారం ప్రియా సింగ్ సీసీ టీవీ పుటేజ్‌ను పరిశీలించగా కేర్ టేకర్స్ జంతువులను కొడుతూ ఆనందిస్తున్న దృశ్యాలు వెలుగు చుశాయి. దీనిపై మలబార్ హిల్స్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. సదరు కేర్ టేకర్స్ రెండు వికలాంగ కుక్కలను కర్రతో కొడుతూ ఆనందం పొందుతూ ఉన్మాద చర్యకు పాల్పడ్డారని చెప్పారు. ఈ నెల 16 తేదీ సీసీ టీవీ ఫుటేజ్‌లో ఈ రోజు ఈ కుక్క కొడుతాను అంటూ గాయపడిన కుక్కను చూపిస్తూ.. ఆపై మరోక కుక్క వైపు వెళ్లి ఇప్పుడు ఈ కుక్కను కొడతాను అంటూ వారిద్దరూ మాట్లాడుకుంటున్న దృశ్యాలు రికార్డయినట్టు తెలిపారు. అంతేగాక ప్రకాష్ అనే కేర్ టేకర్ గాయపడిన కుక్కలలో ఒకదాని మొహంపై టవల్ పెట్టి కర్రతో దానిని తీవ్రంగా బాధించాడని ఆయన తెలిపారు. వీరిఇద్దరిపై జంతు క్రూరత్వ నిరోధక చట్టం ప్రకారం ఐపీసీ 34, 428లతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. -
ఆ గిఫ్ట్ ఇవ్వగానే ఏడ్చేసిన వృద్ధుడు
-
మనిషిని ఈడ్చుకెళ్లి చంపిన పులి పిల్లలు
బెంగళూరు : బెంగళూరులోని బన్నర్‌ఘట్టా బయోలాజికల్ పార్కులో శనివారం విషాదం చోటుచేసుకుంది. పార్క్‌లో కేర్‌టేకర్‌గా పనిచేస్తున్న అంజి(41) అనే వ్యక్తిపై రెండు తెల్ల పులి పిల్లలు దాడి చేయడంతో మరణించాడు. ఆ ఉద్యోగి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వెంటనే ఆ పిల్లలు దాడి చేసి ఈడ్చుకెళ్లి చంపేశాయి. అవి దాడి చేసే సమయంలో అంజి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ అవి వెంబడించి దారుణంగా చంపేశాయి. పార్కు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసుల అసహజ మరణం కింద కేసు నమోదు చేశారు. కేర్‌టేకర్ మరణించినట్లు పార్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. రాయల్ బెంగాల్ టైగర్స్ దాడిలో ఇటీవల తెల్లపులి మరణించిన విషయం తెలిసిందే. బెంగుళూరుకు సమీపంలో ఈ బన్నర్‌ఘట్టా జాతీయ పార్కు ఉంది. 1970లో ఈ పార్కును ప్రారంభించారు. 1974లో ఈ పార్కును జాతీయ పార్క్‌గా ప్రకటించారు. ఈ పార్క్ దాదాపుగా 260 కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. -
అల్లరి చేస్తోందని వాతలు పెట్టింది
అనంతపురం: జిల్లాలోని పెనుగొండ మండలంలోని మారుతీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. స్థానిక అంగన్వాడీ స్కూల్లో పని చేస్తున్న శకుంతల అనే ఆయా అల్లరి చేస్తోందనే కారణంతో భవ్య అనే చిన్నారికి వాతలు పెట్టింది. ఈ విషయం తెలిసిన చిన్నారి తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సీడీపీఓ ప్రభావతమ్మ తక్షణమే శకుంతలను విధుల నుంచి తొలగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఔట్ సోర్సింగ్ కు బాలికల హాస్టళ్లు
నిర్వహణలో స్థానికులకే ప్రాధాన్యం, రూ. 10 వేల వేతనం భద్రత సమస్యలపై దృష్టి పెట్టని సర్కారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల ఆవరణలో 102 బాలికల హాస్టళ్లను త్వరలో ప్రారంభించబోతున్న ప్రభుత్వం.. వాటి నిర్వహణ బాధ్యతలను ఔట్సోర్సింగ్ సిబ్బందికి అప్పగించేందుకు కసరత్తు చేస్తోంది. రూ. 5 వేలు గౌరవ వేతనం ఇస్తూ హాస్టళ్ల నిర్వహణ బాధ్యతలను ఆయా పాఠశాలల్లోని సీనియర్ మహిళా టీచర్‌కే అప్పగించాలని మొదట్లో భావించింది. టీచర్ తన కుటుంబాన్ని వది లేసి బాలికలతోపాటు హాస్టల్లో ఉండాలన్న నిబంధన నేపథ్యంలో ఎవరూ ముందుకు రాలేదు. ఔట్‌సోర్సింగ్‌పై ఒక్కో మహిళకు రూ. 10 వేల చొప్పున వేతనమిచ్చే ఏర్పాట్లు చేస్తోంది. డిగ్రీతోపాటు డీఎడ్ లేదా బీఎడ్ చేసి ఉన్నవారికే బాధ్యతలను అప్పగించేలా నిబంధనలను రూపొందిస్తోంది. 25 ఏళ్ల పైబడిన మహిళలకు కేర్ టేకర్ పేరుతో ఈ బాధ్యతలు అప్పగించాలని, స్థానిక మండలానికి చెందినవారికే ప్రాధాన్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. స్కూల్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ కమిటీ (ఎస్ఎండీసీ) ఆధ్వర్యంలో వారిని నియమిం చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఒక్కో హాస్టల్లో 9 నుంచి 12వ తరగతి వరకు చదివే 100 మంది బాలికలకు ప్రవేశాలు కల్పిస్తారు. ఈ హాస్టళ్లు ఉన్న ప్రాంతాలన్నీ శివారు ప్రాం తాలే. బాలికల భద్రత ఎలా అన్న అంశం ప్రధానసమస్యగా మారింది. జనావాసాలకు దూరంగా ఉన్నందునా రాత్రివేళల్లో మహిళా కేర్‌టేకర్‌కు మొత్తం బాధ్యతను అప్పగించడం వల్ల ఏమైనా సమస్యలు వస్తే ఏం చేయాలన్న దానిపై సర్కారు దృష్టి పెట్టలేదు. అనుకోని సంఘటనలు జరిగినపుడు కేర్ టేకర్‌పై ఎలాంటి చర్యలు చేపట్టవచ్చన్న దానిపైనా స్పష్టత లేదు. బాలికల హాస్టళ్లకు రాత్రివేళల్లో కచ్చితంగా మహిళా కానిస్టేబుళ్ల భద్రత అవసరమని అధికారులు పేర్కొంటున్నారు. -
ప్రత్యూష బాధ్యతలకు 'దుర్గాబాయి దేశ్ ముఖ్'
హైదరాబాద్: ఎట్టకేలకు ప్రత్యూషకు అండగా నిలిచేందుకు ప్రముఖ సంస్థ ముందుకొచ్చింది. ఆమెమంచి చెడులు చూసేందుకు, పూర్తిస్థాయి బాధ్యతలు చూసేందుకు దుర్గాబాయి దేశ్ ముఖ్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ సంస్ధ శనివారం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనుంది. కన్నతండ్రి, సవతి తల్లి చేతిలో దారుణంగా చిత్ర హింసలకు గురై ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకున్న విషయం తెలిసిందే. అయితే, ప్రత్యూష పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అందరూ ఉన్నా.. ఆమె సంరక్షణకు ఎవరూ ముందుకు రాకపోవడం బాధకలిగిస్తోందని హైకోర్టు పేర్కొంది. కోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు పలువురిని కదిలించాయి. అంతకుముందు ఎవరూ ముందుకు రాకుంటే ప్రత్యూష బాధ్యతలు తాను తీసుకుంటానంటూ నటుడు పోసాని కృష్ణమురళి ముందుకొచ్చిన విషయం తెలిసిందే.