
కోల్‌కతా: ఆలయంలో విగ్రహం కోసం ఒడిశా నుంచి సీఎం మమతా బెనర్జీ వేప మొద్దుల్ని దొంగలించారా? అంటే అవుననే అంటున్నారు ఒడిశా బీజేపీ నేతలు
పశ్చిమ బెంగాల్ దిఘూలో జగన్నాథుడి పాలరాతి విగ్రహం ప్రతిష్ఠాపన జరిగింది.ఈ ఆలయంలో విగ్రహం కోసం ఒడిశా నుంచి మమతా వేప మొద్దులు దొంగిలించదని ఒడిశా బీజేపీ నేతలు మమతా బెనర్జీపై ఆరోపణలు చేశారు. అయితే, ఆ ఆరోపణల్ని దీదీ ఖండించారు.
బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ఇంట్లోనే నాలుగు వేప చెట్లు ఉన్నాయి. దొంగిలించాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో జగన్నాథ స్వామిని పూజించడం నేరమా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ, ఒడిశా బీజేపీ పాలనలో పశ్చిమ బెంగాల్ వలసకూలీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.