ఏఐ చేతుల్లో పిల్లల ఎదుగుదల.. ఒడిశాలో శ్రీకారం | Odisha Launches to Develop AI Tool for Monitoring Growth of Children | Sakshi
Sakshi News home page

ఏఐ చేతుల్లో పిల్లల ఎదుగుదల.. ఒడిశాలో శ్రీకారం

Apr 8 2025 4:22 PM | Updated on Apr 8 2025 4:31 PM

Odisha Launches to Develop AI Tool for Monitoring Growth of Children

భువనేశ్వర్: వయసుకు తగిన విధంగా పిల్లలు ఎదుగుతున్నారా? ఎత్తు, బరువు సరైన విధంగానే అభివృద్ధి చెందుతోందా? వారు పోషకాహార లోపాలను(Nutritional deficiencies) ఎదుర్కొంటున్నారా? మొదలైనవన్నీ తెలుసుకోవడం ఇకపై చాలా సులభం కానున్నాయి. ఇందుకు కృత్రిమ మేథ తోడ్పాటునందించనుంది.  

పిల్లల  సమగ్ర ఎదుగుదలను పర్యవేక్షించేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సాధనాన్ని అభివృద్ధి చేసేందుకు ఒడిశా ప్రభుత్వం ప్రత్యేక పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ విధమైన కార్యక్రమాన్ని చేపట్టిన తొలి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. ‘ఏఐ ఫర్ గ్రోత్ మానిటరింగ్: డెవలప్‌మెంట్ ఆఫ్ యాన్  ఏఐ టూల్ ఫర్ చైల్డ్ ఆంత్రోపోమెట్రీ’ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (కేంద్ర ప్రభుత్వం), వధ్వానీ ఏఐ, ఐసీఎంఆర్‌-ఆర్‌ఎంఆర్‌సీ భువనేశ్వర్, పోషణ్ అభియాన్‌ను సంయుక్తంగా సహకారాన్ని అందిస్తున్నాయి.

నూతనంగా రూపొందించబోయే ఈ ఏఐ టూల్‌(AI tool) సాయంతో అంగన్‌వాడీ కార్యకర్తలు తమ దగ్గరకు వచ్చే పిల్లల బరువు, ఎత్తు, తల చుట్టుకొలత, ఛాతీ చుట్టుకొలత  మొదలైన వాటి పెరుగుదల తగిన విధంగా ఉందో లేదో తెలుసుకోగలుగుతారు. ఈ వినూత్న విధానం ఆంత్రోపోమెట్రిక్ అంచనాల ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం, పోషకాహార లోపాన్ని ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది. అంగన్వాడీ కార్యకర్తలకు ఐసీఎంఆర్‌-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్‌), ఐసీఎంఆర్‌-ఆర్‌ఎంఆర్‌సీ భువనేశ్వర్, వధ్వానీ ఏఐ  నిపుణులు శిక్షణను అందించనున్నారు. శిక్షణ పొందిన ఇన్వెస్టిగేటర్లు(Investigators) నాలుగు నెలల పాటు రాష్ట్రంలోని బాలాసోర్, కటక్, గంజాం, జాజ్‌పూర్, కియోంఝర్, మయూర్‌భంజ్ జిల్లాల్లోని చిన్నారుల డేటాను సేకరిస్తారు. ఈ డేటా సేకరణ పైలట్ అంచనాకు ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమాన్ని ఒడిశా మహిళా, శిశు అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శుభా శర్మ ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: దుబాయ్‌ ‍క్రౌన్‌ ప్రిన్స్‌ లైఫ్‌ స్టయిల్‌ తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement