అనిశ్చిత ప్రపంచంలో 'నిశ్చిత మార్గం' | President Teiji Tominagas commencement address to the 2026 batch of graduates of Tohoku University Japan | Sakshi
Sakshi News home page

అనిశ్చిత ప్రపంచంలో 'నిశ్చిత మార్గం'

Oct 26 2026 3:34 AM | Updated on Oct 26 2026 3:35 AM

President Teiji Tominagas commencement address to the 2026 batch of graduates of Tohoku University Japan

విశ్వ గురు

ప్రియమైన విద్యార్థులారా! ఈ రోజు మీ జీవితాల్లో ఎంతో ప్రత్యేకమైన రోజు. తోహోకు యూనివర్సిటీ తరఫున మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తి చేసిన వారు; మాస్టర్స్, వృత్తివిద్యలో ఉన్నత డిగ్రీలు పొందినవారు; పరిశోధనలో అత్యున్నత స్థాయిని చేరుకుని డాక్టరేట్‌ సాధించిన వారు– మీరందరూ ఈ రోజు ఒక గొప్ప మైలురాయిని చేరు కున్నారు. 

ఇది మీకు మాత్రమే కాదు, యూనివర్సిటీకి కూడా గర్వకారణం. ప్రపంచంలోని 43 దేశాలు, ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ రోజు పట్టాలు అందుకోవడం నాకు ఎంతో సంతో షాన్ని కలిగిస్తోంది. మీ రాకతో మన ఈ యూనివర్సిటీ నిజమైనఅంతర్జాతీయ విద్యా కుటుంబంగా మారింది. 

ఊహించని మార్పుల మధ్య ప్రయాణంగత కొన్నేళ్లుగా ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించడానికి ‘వీయూసీఏ(వలాటైల్, అన్‌సర్‌టైన్, కాంప్లెక్స్,ఆంబిగ్యుయస్‌) ప్రపంచం’ అనే మాటను ఉపయోగిస్తున్నారు.అంటే... వేగంగా మారుతూ, అనిశ్చితితో నిండి, అనేక సంక్లిష్టత లతో కూడిన సందిగ్ధ ప్రపంచం. ఇప్పుడు కొందరు మనం మరో దశలోకి అడుగుపెట్టామని చెబుతున్నారు. దాన్ని ‘బీఏఎన్‌ఐ (బ్రిటిల్, ఆంక్సియస్, నాన్‌ లీనియర్, ఇన్‌కాంప్రెహెన్షబుల్‌ప్రపంచం’ అంటున్నారు. అంటే... ఎప్పుడు ఏం జరుగుతుందో తెలి యని పరిస్థితులు, పెరుగుతున్న ఆందోళనలు, ఊహించని పరిణా మాలు, అర్థంకాని క్లిష్టమైన సమస్యలతో కూడిన ప్రపంచం. 

బయటికి ఎంతో బలంగా కనిపించే వ్యవస్థలు కూడా ఒక్క సారిగా కుప్పకూలవచ్చు. చిన్న సంఘటన కూడా ఊహించనివిధంగా పెద్ద మార్పుకు కారణం కావచ్చు. కొన్ని పరిణామాలుఎంత వేగంగా, సంక్లిష్టంగా మారతాయంటే... వాటిని అర్థం చేసుకోవడమే కష్టమవుతుంది. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో వస్తున్న వేగవంతమైన మార్పులు దీనికి ఉదాహరణ. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) అనేక అవకాశాలను తెస్తూనే, కొత్త సమస్యలకు కూడా కారణమవుతోంది. రాబోయే పది, ఇరవై సంవత్సరాల్లో ప్రపంచం ఎలా ఉండబోతోందో మనం ఊహించలేం.

చరిత్ర నుంచి పాఠాలు
ప్రియమైన విద్యార్థులారా! ఇలాంటి అనిశ్చిత ప్రపంచంలోనే మీ జీవిత ప్రయాణం కొనసాగనుంది. అయితే ఒక విషయంగుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో జరిగే మార్పులకు అనుగుణంగా జీవించడమే కాదు, ఆ మార్పులకు దిశానిర్దేశం చేసే అవకాశం కూడా మీకు ఉంది. మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోవాలి. మీ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సైతం భాగస్వాములు కావాలి. ఈ భూమిపై మానవాళి భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాల్లో మీ వంతు పాత్ర పోషించాలి.

అయితే, ఇన్ని మార్పులు చోటుచేసుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలి? గత తరాలు అనుసరించిన మార్గాన్నే మనం ఎప్పటికీ అనుసరిస్తూ ఉండలేం. ఒకప్పుడు మంచి ఫలితాలను ఇచ్చిన పరిష్కారాలు భవిష్యత్తులోనూ పనిచేస్తాయని చెప్పలేం. కాలం మారుతున్నప్పుడు మన ఆలోచనలు కూడా మారాలి.అంతమాత్రాన గతాన్ని మర్చిపోవాలని కాదు. నిజానికి, మనం చరిత్ర నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. 

యుద్ధాలు, ఘర్షణలు, వివక్ష, పర్యావరణ విధ్వంసం... ఇలా మానవాళి గతంలో ఎన్నో తప్పులు చేసింది. వాటివల్ల కలిగిన నష్టాలను మనం మర్చిపోకూ డదు. అలాంటి తప్పులు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడాలి.అందుకే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. గతం నుంచి పాఠాలు నేర్చుకోండి. కానీ గతానికే పరిమితమైపోకండి. స్వీయ ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వండి. కొత్త ప్రశ్నలు అడగండి. సమస్యలకు వినూత్న పరిష్కారాలు వెతకండి. ఈ భూమిపై మానవాళి సుఖంగా జీవిస్తూ, అభివృద్ధి చెందుతూ ఉండా లంటే.. మనం ఏం చేయాలో ఆలోచించండి.

ఆలోచనలు... ఆవిష్కరణలు
కొత్త ఆలోచనలు.. కొత్త ఆవిష్కరణలు అనే ఆలోచనా విధానమే తోహోకు యూనివర్సిటీకి పునాది. 1907లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ యూనివర్సిటీ మూడు ప్రధాన ఆశ యాలతో ముందుకు సాగుతోంది. అవి: పరిశోధనలకు మొదటి ప్రాధాన్యం; అందరికీ అవకాశాలు; ఆచరణకు ఉపయోగపడే పరిశోధన, విద్య.2024లో జపాన్‌లో అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ పరిశోధనా విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన తొలి యూనివర్సిటీగా తోహోకు నిలిచింది. జపాన్‌ ప్రభుత్వంనుంచి గరిష్ఠంగా 25 సంవత్సరాల పాటు లభించే ఆర్థిక సహ కారంతో, ప్రపంచంలోని ప్రముఖ పరిశోధనా యూనివర్సిటీల్లో ఒకటిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా ప్రయత్నాలకు మూడు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. అవి: పరిశోధనల ద్వారా సమాజంపై సానుకూల ప్రభావం చూపడం, ప్రతిభావంతులను పోత్సహించడం, అవసర మైన మార్పులను తీసుకు రావడం. 

ప్రస్తుతం జపాన్‌ పరిశోధనా రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రపంచస్థాయి పరిశోధనా యూనివర్సిటీగా ఎదగడంఅంటే ప్రభుత్వ నిధులు పొందడం, పరిశోధనల సంఖ్యనుపెంచడం లేదా అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో ముందుండటం మాత్రమే కాదు. యూనివర్సిటీ భవిష్యత్తులో ఎలా ఉండాలి? సమా జానికి ఎలాంటి సేవ చేయాలి? ప్రపంచానికి ఏమి అందించాలి? అనే అంశాలపై ఒక ఉమ్మడి లక్ష్యం ఉండాలి. విద్యార్థులు, పరిశో ధకులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు... అందరూ ఈ లక్ష్యం కోసం కలిసి పనిచేయాలి. ఒక్కరి కృషితోనే గొప్ప మార్పులు రావు.అందరూ ఒకే లక్ష్యంతో కలిసికట్టుగా పనిచేసినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. 

ప్రియమైన పట్టభద్రులారా! ఈ రోజు మీరు యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్లి, జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించ బోతున్నారు. మీలో కొందరు పరిశోధనలను కొనసాగిస్తారు. మరి కొందరు ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, వైద్యరంగం, విద్యారంగం వంటి రంగాల్లో పనిచేస్తారు. కొందరు జపాన్‌లోనేఉంటారు. మరికొందరు ప్రపంచంలోని వివిధ దేశాలకు వెళ్లి తమ ప్రతిభను చాటుకుంటారు.

మీరు ఎక్కడికి వెళ్లినా, ఇక్కడ నేర్చుకున్న ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. అదే సవాళ్లను స్వీకరించే మనస్తత్వం. కొత్త పరిస్థితులు ఎదురైనప్పుడు భయపడి వెనక్కి తగ్గకండి. మార్పులను అర్థం చేసుకోండి. వాటికి అనుగుణంగా మీ ఆలోచనలను మార్చుకోండి. అవసరమైతే కొత్తగా నేర్చుకోండి.కొత్త ప్రయత్నాలు చేయండి. మార్పులకు భయపడితే, భవిష్యత్తులో మన కోసం ఎదురుచూస్తున్న కొత్త అవకాశాలను అందుకోలేం.కొత్త తలుపులు తెరుచుకోవాలంటే... వాటిని తెరవడానికి మనంముందడుగు వేయాలి.

ఒకప్పుడు మంచి ఫలితాలను ఇచ్చిన పరిష్కారాలు భవిష్యత్తులోనూ పనిచేస్తాయని చెప్పలేం. కాలం మారు తున్నప్పుడు మన ఆలోచనలు కూడా మారాలి.

జపాన్‌లోని తోహోకు యూనివర్సిటీ 2026 బ్యాచ్‌ పట్టభద్రులను ఉద్దేశించి విశ్వవిద్యాలయం అధ్యక్షుడు తెయిజీ తొమినగా చేసిన స్నాతకోత్సవ ప్రసంగం సంక్షిప్త పాఠం:

మార్పులకు భయపడితే, మన కోసం ఎదురుచూస్తున్న కొత్త అవకాశాలను అందుకోలేం. కొత్త తలుపులు తెరుచు కోవాలంటే, వాటిని తెరవడానికి ముందడుగు వేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement