
భువనేశ్వర్: ఒడిశాలోని బెర్హంపూర్ (బ్రహ్మపూర్) నుండి గుజరాత్‌లోని ఉధ్నా (సూరత్) వరకు నడిచే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కొత్త రైలు వివిధ రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని అందించడంతో పాటు పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ, నూతన ఉద్యోగాలను సృష్టించనుంది.
ఈ ఒడిశా-గుజరాత్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ,గుజరాత్‌ల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 09022) సెప్టెంబర్ 27న 12:00 గంటలకు బ్రహ్మపూర్ నుండి బయలుదేరి మరుసటి రోజు 21:00 గంటలకు ఉధ్నా (సూరత్) చేరుకుంటుంది. ఈ రైలు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్‌లోని కీలకమైన ఆర్థిక, పారిశ్రామిక కేంద్రాల మీదుగా వెళుతుంది. ఖనిజ, వస్త్ర, వాణిజ్య కేంద్రాలను కలుపుతుంది.
ఒడిశా-గుజరాత్ ఎక్స్‌ప్రెస్ ప్రధాన స్టాప్‌లు
పలాస, విజయనగరం, రాయగడ, టిట్లాగఢ్, రాయ్‌పూర్, నాగ్‌పూర్, భుసావల్, నందూర్‌బార్
మరికొన్ని స్టాప్‌లు
శ్రీకాకుళం, బొబ్బిలి, పార్వతీపురం, సుంగర్‌పూర్ రోడ్, మునిగూడ, కేసింగ, కాంతబంజి, ఖరియార్ రోడ్, మహాసముంద్, లఖోలి, దుర్గ్, గోండియా, వార్ధా, బద్నేరా, అకోలా, మల్కాపూర్, జల్గావ్, ధరన్‌గావ్, అమల్నేర్, సింధ్‌ఖేడా, దొండాయిచా, నవాపూర్, నవాపూర్, వ్యారా, బార్డోలి.
రైలు ఫీచర్లు
ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆధునిక ఎల్‌హెచ్బీ కోచ్‌లు ఉన్నాయి. సౌకర్యవంతమైన సీటింగ్ ఏర్పాట్లు ఆధునిక ఆన్‌బోర్డ్ సౌకర్యాలున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో కూడిన 22 కోచ్‌లను ఏర్పాటు చేశారు. 11 జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు , ఎనిమిది స్లీపర్ క్లాస్ కోచ్‌లు , రెండు సెకండ్ క్లాస్ కమ్ లగేజ్ వ్యాన్‌లు, ఒక ప్యాంట్రీ కార్ ఉంది.