మురికివాడ ప్రజలు వర్సెస్ పోలీసులు | clash between police-slum dwellers in Odisha | Sakshi
Sakshi News home page

మురికివాడ ప్రజలు వర్సెస్ పోలీసులు

Apr 19 2025 10:28 PM | Updated on Apr 19 2025 10:28 PM

clash between police-slum dwellers in Odisha
  • ఒకరు మృతి, 19 మందికి గాయాలు
  • ఒడిశాలో ఘటన

రూర్కేలా:  ఒడిశా రాష్ట్రంలోని సుందర్ ఘర్ జిల్లాలో మురికివాడల్లో నిర్వాసితులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒకరు మృత్యువాత పడగా, 19 మంద గాయపడ్డారు. గాయపడిన వారిలో అదనపు తహసీల్దార్ కూడా ఉన్నారు. సుందర్ ఘర్ జిల్లాలోని బర్కానీ ఏరియాలో నివాసముండే మురికివాడ నిర్వాసితులను ఖాళీ చేయించే క్రమంలో అధికారులు అక్కడ వచ్చారు. 

ఈ క్రమంలోనే వారు ఖాళీ చేసేది లేదని తేల్చిచెప్పడంతో అటు పోలీసులకు మురికివాడ నిర్వాసితులకు ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు లాఠీ చార్జీ చేయగా, దాన్ని వారు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ క్రమంలోనే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతం మీదుగా రైల్వే లైన్ మంజూరు కావడంతో అక్కడ ఉండే వారిని ఖాళీ చేయించేందుకు అధికారులు పూనుకున్నారు. దీనిలో భాగంగా పోలీసుల్ని తీసుకునిన అక్కడకు వెళ్లగా అక్కడ ఉద్రిక్త వాతావారణం చోటు చేసుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement