హైదరాబాద్: అమ్మవారి కల్యాణోత్సవంలో అడుగడుగునా పోలీసుల అత్యుత్సాహం కనిపించింది. వీవీఐపీలు, వీఐపీల సేవలోనే తరించి దర్శనానికి వచ్చిన సామాన్య భక్తజనంపై ఏకంగా లాఠీలను ఝుళిపించడం విస్మయానికి గురిచేసింది. వివిధ రకాల పాస్‌లతో వచ్చిన భక్తులను అనుమతించకపోవడంతో వాగి్వవాదానికి దిగారు.
దీంతో పోలీసులు వారిని చెదరగొట్టే క్రమంలో లాఠీలకు పని చెప్పారు. కల్యాణోత్సవం మొత్తం పోలీసుల చేతులమీదుగానే జరిగిందని చెప్పాలి. దేవాదాయ శాఖ కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. డోనర్స్‌నూ గ్యాలరీలోకి అనుమతించలేదు. ఆలయానికి సుదూర ప్రాంతంలోనే రోడ్లు బ్లాక్ చేయడంతో భక్తులు చాలా దూరం నడవాల్సి వచ్చింది.


