సోషల్‌ మీడియా పోస్టులపైనే ఎందుకింత శ్రద్ధ? | high court questions police focus on social media posts | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా పోస్టులపైనే ఎందుకింత శ్రద్ధ?

Jul 22 2026 7:59 AM | Updated on Jul 22 2026 7:59 AM

high court questions police focus on social media posts

= పోలీసులపై హైకోర్టు అసంతృప్తి  

కర్ణాటక: సోషల్‌ మీడియాలో పోస్టులపై పోలీసులు వేగంగా కేసులు నమోదు చేసుకుని చర్యలు తీసుకుంటున్న వైనంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఎన్నో గంభీరమైన కేసులు ఉండగా, సోషల్‌ మీడియా పోస్టులపైనే ఎందుకింత శ్రద్ధ అంటూ ఘాటుగా ప్రశ్నించింది.   


ఏమిటీ కేసు?  
వివరాలు.. బంట్వాళ బస్టాండులో ఒక యువతి హత్య జరిగితే, సోషల్‌ మీడియాలో న్యాయ విద్యార్థి కిరణ్‌ ఆరాధ్య పోస్టు పెట్టాడు. దీంతో అతనిపై బెంగళూరు హైగ్రౌండ్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలంటూ కిరణ్‌ హైకోర్టును ఆశ్రయించాడు. కిరణ్‌ తరఫు లాయర్, ఎంపీ తేజస్వి సూర్య వాదిస్తూ ఊహాజనితాల మీద ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారని, అందులో ఏ మతాన్ని కించపరచలేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ, కేసు నమోదు చేసి  రెండు రోజులే అయ్యింది, పిటిషనర్‌కు పోలీసులు ఇంకా నోటీసు ఇవ్వలేదని తెలిపారు. పిటిషనర్‌కు ఎటువంటి ఊరట    కల్పించరాదని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ, రాష్ట్రంలో ఎన్నో తీవ్రమైన కేసులు ఉండగా, సోషల్‌ మీడియా పోస్టులపై పోలీసులు శ్రద్ధ చూపడం సమంజసం కాదని, కేసు పూర్తిగా విచారణ జరిగే వరకూ పిటిషనర్‌పై చర్యలు తీసుకోరాదని ఆదేశించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement