సాక్షి,హైదరాబాద్: ఢిల్లీ కాక్రోచ్ జనతా పార్టీ సెగ హైదరాబాద్‌కు తగిలింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఛలో లోక్ భవన్‌కు పిలుపునిచ్చాయి. దీంతో విద్యార్థులు ప్రెస్‌క్లబ్ నుంచి లోక్ భవన్‌కు బయల్దేరారు.
మరోవైపు రాహుల్‌గాంధీ చర్చలపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు. పార్లమెంట్‌లో చర్చిస్తామంటే రాహుల్ గాంధీ ధర్నా విరమిస్తామని అన్నారు. పార్లమెంట్‌లో చర్చించేందుకు సిద్ధమని చెప్పా.ఐతే ఆయన వెంటనే డిమాండ్ మార్చారు.
పార్లమెంట్‌లో చర్చ జరపడమే కాదు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చర్చించాలని మాత్రమే అన్నారు కదా అని ప్రశ్నిస్తే.. మా డిమాండ్లు మారాయని రాహుల్ సమాధానం ఇచ్చారు. ప్రతిపక్ష నేత వెంటవెంటనే మాట మార్చడం సరికాదు’ ట్వీట్‌లో పేర్కొన్నారు.



