రీల్స్‌ పిచ్చి : రైలుకెదురెళ్లి తిరిగి రాని లోకాలకు, వీడియో వైరల్‌ | On Camera Odisha Teen Filming Reel On Tracks Train a boy passed away | Sakshi
Sakshi News home page

రీల్స్‌ పిచ్చి : రైలుకెదురెళ్లి తిరిగి రాని లోకాలకు, వీడియో వైరల్‌

Oct 23 2025 4:41 PM | Updated on Oct 23 2025 4:50 PM

On Camera Odisha Teen Filming Reel On Tracks Train a boy passed away

యూట్యూబ్‌ రీల్స్‌ పిచ్చి అనేకమంది ప్రాణాలుతీస్తోందని తెలిసినా తీరు మారడం లేదు. నిర్లక్ష్యం కొన సాగుతూనే ఉంది. ఫలితంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఒడిశాలోని పూరి జిల్లాలోని జనకదేయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం  ఈ విషాదం చోటు చేసుకుంది.

ఒడిశాలోని పూరీలో రైల్వే ట్రాక్‌పై రీల్ చిత్రీకరిస్తున్న 15 ఏళ్ల  మైనర్‌ బాలుడు రైలు ఢీకొని మృతి చెందాడు. మంగళఘాట్ నివాసి విశ్వజీత్ సాహు తన తల్లితో కలిసి దక్షిణకాళి ఆలయాన్ని సందర్శించాడు. అక్కడి కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వస్తుండగా వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి మలీ రీల్స్‌ తీయడానికి ప్రయత్నించాడు.  అంతే అందరూ చూస్తుండగానే లిప్తపాటు క్షణంలోనే  బాలుడి ప్రాణాలు గాల్లో కలిసిపోవడం విషాదం.

తన మొబైల్ ఫోన్‌లో చిన్న వీడియో రికార్డ్ చేయడానికి రైల్వే పట్టాలకు దగ్గరగా ప్రమాదకరంగా నిలబడి తన మొబైల్‌ ఫోన్‌లో రీల్‌ చిత్రీకరిస్తుండగా, ఎదురుగా వస్తున్న రైలు బలంగా ఢీకొట్టింది.  దీంతో అతను అక్కడికక్కడే  ప్రాణాలుకోల్పోయాడని ప్రత్యక్ష సాక్షులు  తెలిపారు.

ఇదీ చదవండి: డ్రీమ్‌ హౌస్‌ అంటూ గుడ్‌ న్యూస్‌ చెప్పిన స్వీట్‌కపుల్‌

సమాచారం అందిన వెంటనే, ప్రభుత్వ రైల్వే పోలీసు (GRP) అధికారులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం సమీపంలోని ఆసుపత్రికి పంపారు. రైల్వే పట్టాల దగ్గర భద్రతా హెచ్చరికలను పట్టించుకోకుండా సోషల్ మీడియా వీడియోను చిత్రీకరించడానికి ప్రయత్నించినప్పుడు బాలుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

 కాగా ఈ ఏడాది ఆగస్టులో గంజాం జిల్లా బెర్హంపూర్‌కు చెందిన 22 ఏళ్ల యూట్యూబర్ కోరాపుట్‌లోని డుడుమా జలపాతం వద్ద రీల్స్ చిత్రీకరిస్తుండగా కొట్టుకుపోయి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. 

ఇదీ చదవండి: సోదర ప్రేమ, భగినీ హస్త భోజనం : ముహూర్తం ఎపుడంటే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement