రీల్స్‌ పిచ్చి.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు..! | YouTuber Swept Away While Filming Reels In Odisha | Sakshi
Sakshi News home page

రీల్స్‌ పిచ్చి.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు..!

Aug 24 2025 7:53 PM | Updated on Aug 24 2025 8:04 PM

YouTuber Swept Away While Filming Reels In Odisha

రీల్స్‌ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు అనేకం. సమయం, సందర్భం లేకుండా రీల్స్‌ తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలనే ఆత్రమే తప్ప, అసలు చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయనేది గమనించకపోవడంతో ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారు కొంతమంది. తాజాగా ఒడిశాలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. 

ఒడిశాలోని కోరాపూర్‌ జిల్లాలోని దుడుమా వాటర్‌ ఫాల్‌ని తన కెమెరాలో బంధించి రీల్స్‌గా పెడదామనుకున్న యువకుడు కనిపించకుండా పోయాడు. డ్రోన్‌ సాయంతో ఆ వాటర్‌ ఫాల్‌ను బంధించే క్రమంలో గంజామ్‌ జిల్లా బెర్హాంపూర్‌కు చెందిన సాగర్‌ టుడు అనే 22 ఏళ్ల యువకుడు ఆ నీటి ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు చేపట్టింది రెస్క్యూ బృందం. 

సాగర్‌ టుడే అనే యువకుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి ఆ స్పాట్‌కు వచ్చాడు. రెగ్యులర్‌గా పలు పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తూ తన యూట్యూబ్‌ చానల్స్‌లో పోస్ట్‌ చేసే సాగర్‌.. డ్రోన్‌ కెమెరాతో ఆ వాటర్‌ ఫాల్‌ను కెమెరాలో తీస్తున్నాడు. అయితే 

కోరాపుట్‌లోని లామ్టాపుట్ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో మచకుండ ఆనకట్ట అధికారులు ఆనకట్ట దిగువన నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేసిన తర్వాత నీటిని విడుదల చేశారు. అయితే ఆ సమయంలో సాగర్‌ ఒక బండరాయిపై నిలబడి డ్రోన్‌ను నియంత్రిస్తున్నాడు. నీటి ఉధృతి ఎక్కువ కావడంతో బండారాయిపై ఉన్న అతను నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అయితే అతని కోసం స్థానికుల సాయంతో రెస్క్యూ బృందం చర్యలు చేపట్టినా ఆచూకీ మాత్రం లభించలేదని పోలీసులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement