స్కీమ్‌ వర్కర్ల ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

స్కీమ్‌ వర్కర్ల ర్యాలీ

Feb 26 2026 9:11 AM | Updated on Feb 26 2026 9:11 AM

స్కీమ్‌ వర్కర్ల ర్యాలీ

స్కీమ్‌ వర్కర్ల ర్యాలీ

స్కీం వర్కర్ల ర్యాలీ

పర్లాకిమిడి: భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో ఆశ, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘాల ఆధ్వర్యంలో స్కీం వర్కర్లు బుధవారం స్థానిక జగన్నాథ మందిరం నుంచి కలెక్టరేట్‌ వరకూ ’ప్రతిబాద్‌ దివాస్‌’పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ (గజపతి) కార్యదర్శి అంజలీనాయక్‌, బీఎంఎస్‌ జిల్లా అధ్యక్షులు సుజిత్‌ ప్రధాన్‌, అఖిల ఒడిశా అంగన్‌వాడీ లేడీస్‌ వర్కర్ల మహాసంఘం కార్యదర్శి పుష్పాంజలి పండా తదతరులు పాల్గొన్నారు. కేంద్రం అమలు చేస్తున్న నాలుగు లేబర్‌ కోడ్‌–2020ను తిరిగి సవరణ చేయాలని, అంగన్‌వాడీ, ఆశ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వారికి ఈపీఎస్‌–95లో ఉన్న కనీస పింఛను రూ. వెయ్యి నుంచి రూ. 7,500 వరకూ పెంచాలని, కార్మికులకు ఈపీఎస్‌, ఈఎస్‌ఐ పెంపు, వారానికి అయిదు రోజుల పనిదినాలు, డీఏ అంద జేయాలన్న 11 న్యాయమైన డిమాండ్లపై కలెక్టరేట్‌ వద్ద ఆందోళన జరిపారు. రెండు గంటలసేపు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేసిన అనంతరం రెవెన్యూ ఏడీఎం మునీంద్ర హానగకు వినతిపత్రాన్ని బీఎంఎస్‌ అధ్యక్షులు సుజిత్‌ ప్రధాన్‌, కార్యదర్శి అంజలీ నాయక్‌లు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement