సమస్యలు పరిష్కరించాలని ఆందోళన
రాయగడ : కలెక్టర్ కార్యాలయం ఎదుట భారతీయ మజ్ధూర్ సంఘ్ పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆందోళన చేపట్టింది. భారతీయ మజ్దూర్ సంఘ్ రాయగడ శాఖ కార్యదర్శి గణేష్ కుమార్ సాహు నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో ఆ సంఘ్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు జొగేశ్వర్ దాస్, జయంతి పద్మాలయ సాహు, ఉషారాణి దాస్, మమత బిశ్వాల్, గీతాంజలి హియాల్, సురేష్ సాహు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. శ్రామికుల సమస్యల విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం విచారకరమని జోగేశ్వర దాస్ అన్నారు. సమస్యల సాధన కోసం దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 25 న నిరసన దినోత్సవంగా పరిగణించి ఈ ఆందోళన చేపట్టినట్లు తెలిపారు.
సమస్యలు పరిష్కరించాలని ఆందోళన


