హోర్డింగ్ కూలిన ఘటనలో మృతులకు పరిహారం ప్రకటన
భువనేశ్వర్: కాల వైశాఖి తాండవంతో హోర్డింగు కూలిన ఘటనలో మృతులకు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి బుధవారం పరిహారం ప్రకటించారు. ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం కారణంగా మంగళవారం స్థానిక అయిగిణియా ప్రాంతం దుర్గా పూజ మండపం సమీపంలో ప్రకటన హోర్డింగ్ నిలువునా కూలిపోయింది. ఈ ఘటన ఇద్దరు వ్యక్తుల ప్రాణాల్ని బలిగొంది. మృతులను టున్నా గౌడొ, సచ్చిదానంద ప్రధాన్‌గా గుర్తించారు.
ముఖ్యమంత్రి సహాయం
ఈ సంఘటనపట్ల ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి విచారం వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నిధులను ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుండి విడుదల చేస్తారు.
స్థానికుల ఆందోళన
మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు ఈ విచారకర సంఘటనపై ఆవేదన వ్యక్తం చేసి సముచిత చర్యలతో తగిన న్యాయం కోరుతూ ఆందోళనకు దిగారు. వారి ఆందోళనతో బుధవారం జాతీయ రహదారిపై వాహనాల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానికులు హైవేను దిగ్బంధించారు. ఖండగిరి ఠాణా పోలీసులు హోర్డింగు కూలి వ్యక్తుల దుర్మరణం సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
హోర్డింగ్ కూలిన ఘటనలో మృతులకు పరిహారం ప్రకటన
హోర్డింగ్ కూలిన ఘటనలో మృతులకు పరిహారం ప్రకటన


