కమనీయం
న్యూస్‌రీల్
గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
కల్యాణం..
రాయగడ:
జేకేపూర్‌లో గల శ్రీభూసమేత వేంకటేశ్వర స్వర్ణోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం సుప్రభాత సేవ, వేదపారాయణం, వాసుర్త యోగీశ్వర, బ్రహ్మమండల పూజలు, అష్టదిక్పాలక ఆవాహన, ధ్వజారోహణం పూజలతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో సాయంత్రం కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. మందిర ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద శ్రీసీతారామ చంద్ర స్వామి కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తజనులు ఆనందోత్సాహాలతో హాజరయ్యారు. మందిర ప్రాంగణం భక్తులతో కళకళలాడింది. సుమారు రెండు గంటల పాటుగా జరిగిన స్వామి వారి కల్యాణంలో భక్తులు పాల్గొన్నారు. విగ్రహాలకు వేదపండితులు అంపోలు అనంత వెంకట శ్రీనివాసాచార్యులు, గోపీనంబాళ్ల శేషాచార్యులు ఆధ్వర్యంలో కల్యాణ క్రతువు జరిగింది. అనంతరం జేకేపూర్‌లో గల ప్రముఖులను మందిరం కమిటీ ఉపాధ్యక్షుడు పట్నాన గౌరి శంకర్ రావు వేదికపై ఘనంగా సన్మానించారు. వేదపండితులు జి.శేషాచార్యులను సత్కరించారు. గోపూజలు, విశేష హోమాలు, నీరాజన మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాలతో కార్యక్రమాన్ని ముగించారు. మందిరం ప్రాంగణంలో సామూహిక కుంకుమార్చనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కమనీయం


