నా కోరిక తీరుస్తావా? లేదా.. బీఈడీ కాలేజీలో లెక్చరర్‌ వేధింపులు | Odisha Fakir Mohan College Incident Full Details | Sakshi
Sakshi News home page

నా కోరిక తీరుస్తావా? లేదా.. బీఈడీ కాలేజీలో లెక్చరర్‌ వేధింపులు

Jul 13 2025 8:10 AM | Updated on Jul 13 2025 11:55 AM

Odisha Fakir Mohan College Incident Full Details

బాలసోర్‌: తనను లైంగికంగా వేధిస్తున్న లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని ఓ విద్యార్థిని కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. ఎలాంటి చర్యలూ లేకపోవడంతో మనస్తాపం చెంది శనివారం కళాశాల ఆవరణలోనే ఒంటికి నిప్పంటించుకుంది. దాదాపు 90 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఈ దారుణం ఒడిశాలోని బాలసోర్‌లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. బాధితురాలు బాలసోర్‌లోని ఫకిర్‌ మోహన్‌ అటానమస్‌ కాలేజీలో బీఈడీ సెకండ్‌ ఇయర్‌ చదువుకుంటోంది. కాలేజీలో తన విభాగం హెచ్‌వోడీ, లెక్చరర్‌ లైంగికంగా వేధిస్తున్నారంటూ జూన్‌ 30వ తేదీన ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు అందించింది. ఆ లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలంటూ కాలేజీ క్యాంపస్‌లో వారం రోజులపాటు నిరసన కూడా కొనసాగించింది. శనివారం ప్రిన్సిపల్‌ దిలీప్‌ ఘోష్‌ను కలిసింది. అనంతరం కాలేజీ ఆవరణలోనే నిప్పంటించుకుంది. మంటలు ఆర్పి, ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన ఓ విద్యార్థి సైతం గాయపడ్డాడు. దాదాపు 90 శాతం కాలిన గాయాలైన బాధితురాలు ప్రస్తుతం భువనేశ్వర్‌ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతోంది.

ఈ ఘటన అనంతరం, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వేధింపులకు పాల్పడిన లెక్చరర్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సూర్యవంశీ స్పందిస్తూ.. సదరు లెక్చరర్‌, కాలేజీ ప్రిన్సిపాల్‌లను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ‌ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement