breaking news
BEd student
-
బీఈడీ స్టూడెంట్ కేసు.. ఏబీవీపీ నేత అరెస్ట్
ఒడిశా బీఈడీ స్టూడెంట్ బలవన్మరణం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే కళాశాల ప్రిన్సిపాల్, వేధింపులకు పాల్పడిన హెచ్‌వోడీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేయగా.. అందులో ఒకరు ఏబీవీపీ నేత ఉండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీనియర్ ఫ్యాకల్టీ వేధింపులు తాళలేక ఒడిశాలో 20 ఏళ్ల బీఈడీ సెకండ్ ఇయర్ విద్యార్థిని కాలేజీ ఆవరణలోనే నిప్పటించుకున్న సంగతి తెలిసిందే. జులై 13వ తేదీన జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. 90 శాతం కాలిన గాయాలతో రెండు రోజుల తర్వాత ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ బాధితురాలు కన్నుమూసింది.ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో.. వేధింపులకు పాల్పడ్డ ఫ్యాకల్టీ సమీర్ రంజన్ సాహోతో పాటు ప్రిన్సిపాల్ దిలీప్ ఘోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అందులో ఏబీవీపీ లీడర్ సుభాత్ సందీప్ నాయక్ కూడా ఉన్నట్లు సమాచారం. బాధితురాలు బలవనర్మణానికి పాల్పడే సమయంలో సందీప్ నాయక్ అక్కడే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఆయనపై ఎలాంటి అభియోగాలు నమోదు అయ్యాయన్నది తెలియరావాల్సి ఉంది.తన కోరికె తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ సమీర్ రంజన్ సాహో సదరు విద్యార్థిపై బెదిరింపులకు దిగాడు. లైంగిక వేధింపులను ఆమె కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. అయినా కూడా అతనిపై చర్యలేవీ తీసుకోలేదని పోలీసుల విచారణలో తేలింది. పైగా.. తనకు చావే గతంటూ ఆమె రాసిన సూసైడ్ నోట్ వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది.అయితే ఘటన జరిగిన రోజు.. ప్రిన్సిపాల్‌ను కలిసిన కాసేపటికే ఆమె ఒంటికి నిప్పటించుకుందని పోలీసులు చెబుతున్నారు. హెచ్‌వోడీపై ఫిర్యాదు నేపథ్యంతో ఆరోజు ప్రిన్సిపాల్ గదిలో సమావేశం జరిగింది. సమీర్‌పై చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలని ఆమెపై ఒత్తిడి చేశారని, కొంతమంది విద్యార్థులతో సదరు విద్యార్థిపై ఆ హెచ్‌వోడీ తప్పుడు ప్రచారం చేయించారని దర్యాప్తులో వెల్లడైంది. తాజా అరెస్టుల నేపథ్యంలో దర్యాప్తు మరో మలుపు తిరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. -
ముందే చెబుతున్నా, న్యాయం జరగకపోతే..!
హృదయవిదారకమైన ఒడిషా బాలాసోర్ బీఈడీ సెకండియర్ స్టూడెంట్ సూసైడ్ కేసులో షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. హెచ్‌వోడీ లైంగిక వేధింపుల పర్వాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ఈ క్రమంలో ఆమె ఫిర్యాదు చేసిన కాపీ.. అందులో పేర్కొన్న విషయాలు బయటకు వచ్చాయి. బాలాసోర్ బీఈడీ విద్యార్థిని బలవన్మరణం కేసులో విస్తుపోయే విషయం వెలుగు చూసింది. నిప్పంటించుకునే పది రోజుల ముందు.. 22 ఏళ్ల బాధిత విద్యార్థిని సీఐసీసీ(college's internal complaints committee)కి ఫిర్యాదు చేసింది. అందులో సీనియర్ ఫ్యాకల్టీ నుంచి తనకు ఎదురైన ఇబ్బందులను ప్రస్తావిస్తూనే.. చర్యలు తీసుకోకుంటే గనుక ప్రాణం తీసుకుంటానని హెచ్చరించింది కూడా. జులై 1వ తేదీన ఆమె రాసిన లేఖలో ఇలా.. గత కొన్ని నెలలగా బీఈడీ డిపార్ట్మెంట్ హెచవోడీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ సమీర్ కుమార్ సాహూ నన్ను వేధిస్తున్నారు. తక్కువ మార్కుల వేస్తానని, నన్ను ఫెయిల్ చేస్తానని.. నా గురించి నా కుటుంబంతో లేనిపోనివి చెబుతానని బెదిరిస్తూ వస్తున్నారు. అన్నింటికి మించి తన కోరికెలు తీర్చమంటూ వేధిస్తున్నారు. మనశ్శాంతి కరువై మానసికంగా ఇబ్బంది పడుతున్నా. నా ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే.. నేను బలవన్మరణానికి పాల్పడతాను. నా చావుకు హెచ్‌వోడీ, కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుంది అని లేఖ రాసిందామె. జూన్ 30వ తేదీన ఫకీర్ మోహన్ కాలేజీ ప్రిన్సిపల్ దీలీప్ ఘోష్ దృష్టికి ఆమె విషయాన్ని తీసుకెళ్లింది. ఆ మరుసటిరోజు ఆమె రాతపూర్వకంగా ఫిర్యాదును సమర్పించింది. అంతటితో ఆగకుండా.. పది రోజులపాటు ఆ ఫిర్యాదు కాపీని సోషల్ మీడియాలో పోస్టు చేసి చర్యలు తీసుకోవాలంటూ సీఎం, విద్యాశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యేను ట్యాగ్చేసి మరీ కోరింది. అయినా ఫలితం లేకపోయింది. జులై 12వ తేదీన.. ఆమె కాలేజీలోని ప్రిన్సిపల్ గది ఆవరణలో నిప్పటించుకుంది. 95 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలో ఆమెను రక్షించడానికి వెళ్లిన మరో విద్యార్థిని కూడా 70 శాతం గాయాలపాలై చికిత్స పొందుతోంది. ప్రధాన బాధితురాలిని బాలాసోర్ జిల్లా ఆస్పత్రిలో.. ఆపై భువనేశ్వర్‌లో ఎయిమ్స్‌కు ఆమెను తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి బాధితురాలు కన్నుమూసింది. ఈ కేసుకు సంబంధించిన బీఈడీ హెచ్‌వోడీ సమీర్ కుమార్ సాహూ, కాలేజీ ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్‌లను కాలేజీ యాజమానయం తొలగించగా.. ఆపై పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఉదయం బాలాసోర్‌లోని బాధితురాలి స్వగ్రామం పలాసియాకు మృతదేహాన్ని తరలించారు. ఊరు ఊరంతా ఆమె మృతదేహం చూసి కన్నీరు పెట్టుకుంది. ఆమె మృతదేహాంతో కాసేపు రోడ్డుపై ఆందోళనకు దిగింది.ఈ ఘటనపై సీఎం మోహన్ చరణ్ మజ్హీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారాయన. మరోవైపు.. స్వరాష్ట్రం ఒడిశా పర్యటనలో ఉన్నరాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సోమవారం సాయంత్రం AIIMSకి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. ఆపై కాసేపటికే ఆమె కన్నుమూయడం గమనార్హం.ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో రాజకీయ విమర్శలు వినవస్తున్నాయి. ఆమెది ఆత్మహత్య కాదు.. బీజేపీ వ్యవస్థ చేసిన హత్య అని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. బాధితురాలిని రక్షించడంలో ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్న రాహుల్.. బాధిత విద్యార్థిని ధైర్యంగా తన గొంతుక వినిపించినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: నేనేం చావడానికి ఇక్కడికి రాలేదు! -
నా కోరిక తీరుస్తావా? లేదా.. బీఈడీ కాలేజీలో లెక్చరర్ వేధింపులు
బాలసోర్: తనను లైంగికంగా వేధిస్తున్న లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని ఓ విద్యార్థిని కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. ఎలాంటి చర్యలూ లేకపోవడంతో మనస్తాపం చెంది శనివారం కళాశాల ఆవరణలోనే ఒంటికి నిప్పంటించుకుంది. దాదాపు 90 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఈ దారుణం ఒడిశాలోని బాలసోర్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. బాధితురాలు బాలసోర్‌లోని ఫకిర్ మోహన్ అటానమస్ కాలేజీలో బీఈడీ సెకండ్ ఇయర్ చదువుకుంటోంది. కాలేజీలో తన విభాగం హెచ్‌వోడీ, లెక్చరర్ లైంగికంగా వేధిస్తున్నారంటూ జూన్ 30వ తేదీన ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు అందించింది. ఆ లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలంటూ కాలేజీ క్యాంపస్‌లో వారం రోజులపాటు నిరసన కూడా కొనసాగించింది. శనివారం ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్‌ను కలిసింది. అనంతరం కాలేజీ ఆవరణలోనే నిప్పంటించుకుంది. మంటలు ఆర్పి, ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన ఓ విద్యార్థి సైతం గాయపడ్డాడు. దాదాపు 90 శాతం కాలిన గాయాలైన బాధితురాలు ప్రస్తుతం భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతోంది.Had strict action been taken in this case 👇🏼 FM College Authorities would have been more afraid to remain silent for so long. #fakirmohancollege #Balasore pic.twitter.com/e7T48orQOC— Arunabh Mohanty ।। 🇮🇳 ।। (@arunabh_m) July 13, 2025ఈ ఘటన అనంతరం, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వేధింపులకు పాల్పడిన లెక్చరర్‌ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సూర్యవంశీ స్పందిస్తూ.. సదరు లెక్చరర్, కాలేజీ ప్రిన్సిపాల్‌లను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. @grok explainA second-year integrated B.Ed student at Fakir Mohan Autonomous College in Balasore, Odisha, self-immolated today July 12, after alleging repeated sexual harassment by HoD Samir Kumar Sahu, who demanded favors and threatened her grade#Balasore #arrest #odisha #fm pic.twitter.com/kFapuntvWx— Sweettt (@sweett145) July 12, 2025 -
పెళ్లి రద్దయిందని యువతి ఆత్మహత్య
⇒ ప్రేమిస్తున్నానని పెళ్లి చెడగొట్టిన సమీప బంధువు ⇒ భయంతో ఆ యువకుడూ ఆత్మహత్య వైరా రూరల్: వివాహం రద్దయిందనే మనస్తాపంతో బీఈడీ విద్యార్థిని ఉషారాణి(24) బలవన్మరణానికి ఒడిగట్టింది. ప్రేమిస్తున్నానంటూ ఆమె సెల్‌కు మెసేజ్‌లు పంపిన ఓ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా వైరా మం డలం సోమవరం గ్రామానికి చెందిన కంటేపూడి ఏసోబు–దేవరాణిల రెండో కుమార్తె ఉషారాణి తని కెళ్లలోని బ్రౌన్సు కళాశాలలో బీఈడీ చదువుతోంది. ఆమెకు గత నెల 5న సత్తుపల్లిలోని ద్వారకనగర్‌కు చెందిన ఓ యువకుడితో నిశ్చితార్థం జరిగింది. మే లో వివాహం జరగాల్సి ఉంది. అయితే, ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రా మానికి చెందిన ఉషారాణి సమీప బంధువు పోలగాని నరేంద్ర (26) ప్రేమిస్తున్నానంటూ ఉషారాణి సెల్‌కు తరచూ మెస్సేజ్‌లు పంపేవాడు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు ఉషారాణికి నిశ్చితార్థం చేశారు. ఈ క్రమంలోనే నరేంద్ర... ఉషారాణితో నిశ్చితార్థం చేసుకున్న యువకుడికి ఫోన్ చేసి ‘‘మేము ప్రేమిం చుకుంటున్నాం.. మా వివాహానికి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ’’ చెప్పాడు. దీం తో వివాహం రద్దు అయ్యింది. మనస్తాపం చెందిన ఉషారాణి సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా, ఉషారాణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి.. కృష్ణా జిల్లాలో ఉన్న నరేంద్ర మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేకే నరేంద్ర చనిపోయినట్లు అతడి బంధువులు చెబుతున్నారు.