రేణిగుంటలో 24.5 కిలోల గంజాయి స్వాధీనం | Huge amount of marijuana seized in Renigunta | Sakshi
Sakshi News home page

రేణిగుంటలో 24.5 కిలోల గంజాయి స్వాధీనం

May 16 2025 4:28 AM | Updated on May 16 2025 4:28 AM

Huge amount of marijuana seized in Renigunta

అంతర్‌ రాష్ట్ర గంజాయి మహిళాస్మగ్లర్ల అరెస్ట్‌  

రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్‌): ఒడిశా నుంచి కేరళకు గంజాయి తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు పశ్చిమ బెంగాల్‌ మహిళలను రేణిగుంట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రేణిగుంట లాడ్జిలో ఉన్న వారి వద్ద నుంచి 24.5 కిలోల గంజా­యిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం తిరుపతి జిల్లా ఏఎస్పీ రవిమనోహరాచారి  తెలిపిన వివరాల మేరకు.. పోలీసులకు వచ్చిన రహస్య సమాచారం మేరకు రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఎస్‌బీఎస్‌ లాడ్జిలోని 207 గదిలో డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ జయచంద్ర, ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి సిబ్బందితో సోదాలు నిర్వహించారు. 

పశ్చిమ బెంగాల్‌కు చెందిన మమోని మొండాల్‌ (31), నమితా మొండాల్‌ (37) లను అదుపులోకి తీసుకుని, రెండు సూట్‌కేస్‌లలో ఉన్న రూ.2.45 లక్షల విలువ చేసే 24.5 కిలోల గంజా­యిని స్వాదీనం చేసుకున్నారు. ఈ గంజాయిని ఒడిశా నుంచి రైల్లో కేరళ తీసుకెళుతుండగా వారి సంబం«దీకుల నుంచి సూచన రావడంతో రేణిగుంటలో దిగి లాడ్జిలో బస చేశారు.

వారిద్దరినీ అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో వారు చెప్పిన ఇద్దరు అంతర్‌ రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్‌ చేయాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి సీఐ జయచంద్ర, సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు  అభినందించినట్లు ఏఎస్పీ తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement