ఈ రాశి వారికి సన్నిహితులు నుంచి ధనలబ్ధి.. గృహయోగం | Today Telugu Horoscope On June 29th, 2026: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి సన్నిహితులు నుంచి ధనలబ్ధి.. గృహయోగం

Jun 29 2026 3:03 AM | Updated on Jun 29 2026 9:35 AM

Rasi Phalalu: Daily Horoscope On 29-06-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, తిథి: పౌర్ణమి తె.4.25 వరకు (తెల్లవారితే మంగళ వారం), తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: మూల తె.3.54 వరకు (తెల్లవారితే మంగళవారం), తదుపరి పూర్వాషాఢ, దుర్ముహూర్తం: ప.12.29 నుండి 1.21 వరకు, తదుపరి ప.3.05 నుండి 3.57 వరకు,అమృత ఘడియలు: రా.8.47 నుండి 10.03 వరకు, ఏరువాక పౌర్ణమి.

సూర్యోదయం : 5.31
సూర్యాస్తమయం : 6.34
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం..  పనుల్లో  ప్రతిబంధకాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.

వృషభం...  వ్యయప్రయాసలు. ముఖ్యమైన పనులు నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలు.  వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

మిథునం....  పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికంగా మరింత అనుకూలత. వస్తులాభాలు. పాతమిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కర్కాటకం...  పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు నుంచి ధనలబ్ధి. గృహయోగం. నూతన ఉద్యోగాలలో చేరతారు. వ్యాపారాలు,  ఉద్యోగాలు అభివృద్ధిపథంలో సాగుతాయి.

సింహం....  పరిస్థితులు అనుకూలించవు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు. కొన్ని పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కన్య....  ముఖ్య పనుల్లో ఆటంకాలు. ప్రయాణాలు రద్దు. కుటుంబంలో చికాకులు. ఆలయాల సందర్శనం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ధనవ్యయం.

తుల...  వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో అనుకూలం. కొత్త పనులు మరిన్ని చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శనం.

వృశ్చికం.....  ఆర్థిక పరిస్థితి గందరగోళం. మానసిక అశాంతి. ఆరోగ్యభంగం. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశపరుస్తాయి. ఉద్యోగ ఒత్తిడులు.

ధనుస్సు...  కొత్త విషయాలు గ్రహిస్తారు.  వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. సన్నిహితులతో విభేదాలు నెలకొంటాయి. దైవచింతన.

మకరం...  కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. పనులు నిదానిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభం...  పనుల్లో విజయం. పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఆశాజనకంగా ఉంటుంది. ధనలాభ సూచనలు.

మీనం....  చేపట్టిన పనులు పూర్తి. సంఘంలో గౌరవమర్యాదలు. ప్రముఖులతో పరిచయాలు. శుభవర్తమానాలు. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement