
జాజ్‌పూర్: ఒడిశాలోని జాబ్‌పూర్ జిల్లా కాంతియా గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. ఖరస్రోత నదిలో ఓ మొసలి.. మహిళను లాక్కెళ్లిపోయింది. నదిలో స్నానం చేస్తున్న సౌదామిని (57)ని ఒక ముసలి లాక్కెళ్లడంతో గ్రామంలో కలకలం రేగింది. మహిళను రక్షించేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నించి.. విఫలమయ్యారు. గల్లంతైన మహిళ కోసం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోమవారం( అక్టోబర్ 6) సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఆమె బట్టలు ఉతికేందుకు ఖరస్రోత నది వద్దకు వెళ్లింది. నది ఒడ్డున ఓ చోట స్నానం చేస్తుండగా ఓ మొసలి ఆమెను ఒక్కసారిగా నదిలోకి లాక్కెళ్లింది. అయితే ఓ వంతెనపై వెళ్తున్న స్థానికులు ఈ విషయాన్ని గుర్తించారు. గ్రామస్తులు ఆ మొసలిని వెంబడించి ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు. చివరికి ఆమెను కాపాడలేకపోయారు. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
A live video went viral from Jajpur, Bari area, where a crocodile dragging a waman in to the river, pubil getting panic after watching video #odisha #jajour #crocodile #news #viral #live pic.twitter.com/J1lR1k01D2
— Ajay kumar nath (@ajaynath550) October 7, 2025