
భువనేశ్వర్ : ఒడిశాలోని కియోంజార్ జిల్లాలో జరిగిన ఘటన నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది. రెండో తరగతి రాత్రంతా స్కూల్లోనే బిక్కు బిక్కు మంటూ గడిపిన వైనం కలకలం రేపింది. బన్స్‌పాల్ బ్లాక్ పరిధిలోని అంజార్‌లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం ఈ సంఘటన జరిగింది.
8 ఏళ్ల జ్యోత్స్న దేహూరి రెండో తరగతి చదువుతోంది. స్కూలు ముగిసిన తరువాత జ్యోత్న కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు రాత్రంతా తమ కుమార్తె కోసం వెతికినా ఫలితం కనపించలేదు. అసలేం జరిగిందంటే..
సాయంత్రం 4 గంటలకు పాఠశాల సమయం ముగియడంతో, 8 ఏళ్ల జ్యోత్స్న లోపల ఉందో లేదోచెక్ చేయకుండానేఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాలకు తాళం వేసి వెళ్లిపోయారు. అయితే తాళం వేసిఉన్నట్టు గుర్తించిన జ్యోత్న కిటికీ గుండా పాఠశాల నుండి బయటకు రావడానికి చాలా తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆమె కిటికీ ఊచల మధ్య ఇరుక్కు పోయింది. రాత్రంతా అలానే నరక యాతన అనుభవించింది.
ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!
శుక్రవారం ఉదయం 9 గంటలకు గేటు తెరిచిన తర్వాత ఆమె ఇరుక్కుపోయి ఉండటం చూసి పాఠశాల వంటమనిషి షాక్ అయ్యాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు. వారు ఇనుప రాడ్లను వంచి జ్యోత్స్నరక్షించారు. అనంతరం ముందు జాగ్రత్త చర్యగా ఆస్పత్రికి తరలించారు. అయితే అదృష్టవశాత్తూ చిన్నారికి ఎలాంటి ప్రాణపాయం లేదని డాక్టర్లు చెప్పారు. దీంతో జ్యోత్న్స తల్లిదండ్రులు, స్థానికులు, టీచర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. తాత్కాలిక ప్రధానోపాధ్యాయుడు గౌరహరి మహంతను సస్పెండ్ చేశారు.