
భారతదేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. తులం గోల్డ్ రేటు లక్ష రూపాయలు దాటేసి చాలా రోజులైంది. ఇలాంటి సమయంలో ఒడిశాలో భారీ స్టాయిలో బంగారు ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) వెల్లడించింది.
దేవ్‌ఘర్‌లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు నిర్థారించారు. అయితే సుందర్‌గఢ్, నబరంగ్‌పూర్, కియోంఝర్, అంగుల్, కోరాపుట్‌లలో మాత్రమే కాకుండా.. మయూర్‌భంజ్, మల్కన్‌గిరి, సంబల్‌పూర్, బౌధ్‌లలో అన్వేషణ పనులు జరుగుతున్నాయి.
ఇప్పటి వరకు.. ఒడిశాలో బంగారు నిక్షేపాల నిల్వలు ఎంత ఉన్నాయనే విషయం అధికారికంగా వెల్లడికాలేదు. అయితే నిల్వలు 10 నుంచి 20 మెట్రిక్ టన్నులు ఉండే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.ఇది భారతదేశం దిగుమతి చేసుకుంటున్న బంగారం పరిమాణంతో పోలిస్తే ఇది చాలా తక్కువ.
ఇదీ చదవండి: 'ఇండియాలో ధరలు ఇలా ఉన్నాయ్': ఎన్ఆర్ఐ షాక్
గత సంవత్సరం భారతదేశం 700 - 800 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. దేశంలో గోల్డ్ ఉత్పత్తి తక్కువగా ఉండటమే ఎక్కువగా దిగుమతి చేసుకోవడానికి ప్రధాన కారణం. ప్రస్తుతం ఉత్పత్తి పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. దిగుమతి కొంత తగ్గుతుందని పలువురు భావిస్తున్నారు.