
కెనడాలో పాలు రూ.396, బ్రెడ్ రూ.230 అని ఇప్పటికే చదువుకున్నాం. ఇప్పుడు తాజాగా భారతదేశంలో కూడా ఒక కప్పు టీ తాగడానికి రూ.1000 ఖర్చు చేశానని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. దుబాయ్‌కు చెందిన భారతీయ ట్రావెల్ వ్లాగర్ & రేడియో ప్రెజెంటర్ 'పరీక్షిత్ బలోచి'.. ఇండియాలో పెరుగుతున్న జీవన వ్యయం గురించి వెల్లడించడం చూడవచ్చు. ముంబైలోని ఒక హోటల్‌లో ఒక కప్పు టీ తాగడానికి తనకు రూ. 1,000 ఖర్చైన విషయాన్ని వెల్లడించాడు.
వస్తువుల ధరలు కొంత తక్కువ ఉంటాయని.. అప్పుడప్పుడు భారతదేశానికి వస్తూ ఉంటానని బలోచి చెప్పాడు. ఎన్నారైలు బలమైన విదేశీ కరెన్సీల నుంచి ప్రయోజనం పొందుతారు. ఇండియాకు వచ్చి విదేశీ కరెన్సీలతో.. ఖర్చులు చేస్తూ ఉంటారు. అయితే ఇకపై భారతదేశంలో అది సాధ్యం కాదని అన్నారు. తాను దిర్హామ్‌లలో సంపాదిస్తున్న ఎన్‌ఆర్‌ఐ అయినప్పటికీ, ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యానని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: పిల్లలు కనడానికి సిద్దమవుతున్న రోబోలు!
ముంబై వంటి నగరాల్లో జీవన విధానం, జీవన వ్యయం అన్నీ మారాయి. ప్రస్తుతం ముంబై దుబాయ్ మాదిరిగా ఖరీదైనదిగా అనిపిస్తోందని పరీక్షిత్ బలోచి అన్నాడు. భారతదేశానికి వచ్చిన తర్వాత నేను మాత్రమే 'గరీబ్' అనిపించిందని వ్యాఖ్యానించాడు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.