హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కౌంటర్–డ్రోన్ డిఫెన్స్ సంస్థ ఇంద్రజాల్‌కి కేంద్ర రక్షణ శాఖ నుంచి పలు ఆర్డర్లు లభించాయి. వీటి విలువ రూ. 100 కోట్లుగా ఉంటుంది. దీని కింద కీలక ఆర్మీ, నేవీ స్థావరాలను పరిరక్షించేలా మలీ్ట–లేయర్డ్ అటానామస్ యాంటీ–డ్రోన్ సిస్టంలను అందించాల్సి ఉంటుంది. ఏఐ ఆధారిత అటానామస్ ఎయిర్‌స్పేస్ డిఫెన్స్‌కి సంబంధించి పరివర్తన దిశగా ఇదొక కీలక మైలురాయని సంస్థ తెలిపింది.


