
సోషల్ మీడియా పిచ్చి, షేర్, లైక్స్ మోజులో పడి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఒడిశాకు చెందిన యువ యూట్యూబర్ సాహసం విషాదకరంగా మారింది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని కోరాపుట్ జిల్లాలోని డుడుమా జలపాతం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ విషాద సంఘటన కెమెరాలో సంఘటన రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల అవుతోంది. ఈ సంఘటన రీల్స్ కోసం, సోషల్ మీడియా కంటెంట్ కోసం చేస్తున్న ప్రమాదకర సాహసాలు, ప్రమాదాలపై చర్చలకు దారితీసింది.
తన యూట్యూబ్ ఛానెల్ కంటెంట్ కోసం జలపాతం అందాలను కెమెరాలో బంధించాలన్న ఉద్దేశంతో చివరికి ప్రాణాలే కోల్పోయిన ఘటన బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బాధితుడిని గంజాం జిల్లాలోని బెర్హంపూర్‌కు చెందిన 22 ఏళ్ల సాగర్ (సాగర్ టుడు)గా గుర్తించారు. సాగర్, అతని స్నేహితుడు అభిజిత్ బెహెరాతో కలిసి, పర్యాటక ప్రదేశాల వీడియోలు చేసేందుకు కోరాపుట్ వెళ్లాడు. అక్కడ మధ్యాహ్నం సాగర్ జలపాతం సమీపంలోని ఒక రాతిపై నిలబడి డ్రోన్ కెమెరాను ఉపయోగించి రీల్స్ తీస్తూ ప్రమాదానికి గురయ్యాడు. అలామ్తాపుట్ ప్రాంతంలో భారీ వర్షం కారణంగా మచ్చకుండ ఆనకట్ట అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు, దీనితో జలపాతం వద్ద నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది.
ఇక్కడ సాగర్ వీడియో రికార్డ్ చేస్తూ ప్రవాహా ధాటికి ఒక రాతిపై చిక్కుకుపోయాడు. పర్యాటకులు ,స్థానికులు అతన్ని రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, నీటి వేగం ముందువారి ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. తమ కళ్ల ముందే స్నేహితుడు కొట్టుకుపోవడంతో అతని ఫ్రెండ్స్ కన్నీటి పర్యంతమైనారు. మచకుండ పోలీసులు,అగ్నిమాపక దళం నుండి రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాలింపు చర్యలు చేపట్టాయి.సాగర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. భారీ వర్షాల తర్వాత ఆనకట్ట నుండి సుమారు 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి ముందు మచకుండ అధికారులు దిగువన ఉన్న నివాసితులను అప్రమత్తం చేశారు

మరోవైపు వర్షాకాలంలో ప్రమాదకరమైన సహజ ప్రదేశాలలో. పర్యాటకులు , కంటెంట్ సృష్టికర్తలు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని , జలపాతాలు మరియు ఆనకట్టల దగ్గర జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు
ఇదీ చదవండి: భర్తను కాపాడుకునేందుకు భార్య లివర్ దానం.. కానీ ఇద్దరూ!