
డిజిటల్ రంగంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఓ కప్పు టీ రేటు కన్నా 1 జీబీ డేటా చౌకగా లభిస్తుండటం దీనికి నిదర్శనమని తెలిపారు.

ఒకప్పుడు 2జీ టెలికం సర్వీసుల లభ్యత కూడా కష్టంగా ఉండేదని, ప్రస్తుతం దానికి అనేక రెట్లు మెరుగైన 5జీ సర్వీసులు దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి జిల్లాలోనూ లభిస్తున్నాయని పేర్కొన్నారు.

డేటా వినియోగంలో ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్ దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తోందని తెలిపారు.

డిజిటల్ మౌలికసదుపాయాల కల్పనపై ప్రభుత్వానికి గల చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)ని ప్రారంభించిన సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య విధానాలు, వ్యాపారాలకు అనువైన పరిస్థితులు మొదలైన అంశాల దన్నుతో భారత్.. పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలుస్తోందని ప్రధాని చెప్పారు.





