AP: ఒంటరి మహిళలు, వివాహితలే టార్గెట్‌.. యూట్యూబర్‌ అరెస్ట్‌ | Youtuber Hemadri Arrest AT Tirupati | Sakshi
Sakshi News home page

AP: ఒంటరి మహిళలు, వివాహితలే టార్గెట్‌.. యూట్యూబర్‌ అరెస్ట్‌

May 31 2025 10:39 AM | Updated on May 31 2025 12:57 PM

Youtuber Hemadri Arrest AT Tirupati

సాక్షి, తిరుపతి: తిరుపతిలో దారుణ ఘటన వెలుగు చూసింది. మహిళలను లైంగికంగా వేధిస్తున్న యూట్యూబర్ హేమాద్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి.. సోషల్‌ మీడియా వేదికగా మహిళలను వేధింపులకు గుర్తిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

వివరాల ప్రకారం.. తిరుపతిలో యూట్యూబర్‌ హేమాద్రిని తిరుచానూర్‌ పోలీసులు తాజాగా అరెస్ట్‌ చేశారు. నిందితుడు హేమాద్రి.. సోషల్‌ మీడియా ద్వారా అమ్మాయిలు, ఒంటరి మహిళలకు, వివాహితలతో పరిచయాలు పెంచుకున్నాడు. అనంతరం, వారితో సన్నిహితంగా ఉంటూ ఫొటోలు సేకరించాడు. కొద్ది రోజుల తర్వాత వారిని సోషల్‌ మీడియా వేదికగా వేధింపులకు గురిచేసినట్టు బాధితులు.. పోలీసులు ఆశ్రయించారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. హేమాద్రిని అరెస్ట్‌ చేశారు. మరోవైపు.. హేమాద్రి అరెస్ట్‌ తెలియడంతో తిరుచానూర్‌, తిరుపతి, చంద్రగిరి నుంచి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడిని పోలీసులు విచారిస్తున్నట్టు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement