
భువనేశ్వర్: తండ్రి తెచ్చిన కొత్త బిందె ఓ చిన్నారి ప్రాణం మీదకు తెచ్చింది. సరదాగా ఆడుకుంటుండగా మూడేళ్ల చిన్నారి తల బిందెలో ఇర్కుకుపోయింది. బిందెలో ఇరుక్కున్న తలను బయటకు తీయడం అసాధ్యం కావడంతో ఊపిరి ఆగినంత పనైంది. చివరికి ఏమైందంటే
ఒడిశాలో మల్కాన్‌గిరి జిల్లా కొరుకొండ గ్రామానికి చెందిన ప్రదీప్ బిశ్వాస్ కొత్త బిందె కొని ఇంటికి తెచ్చాడు. నాన్న తెచ్చిన బిందెతో ఆడుతుండగా తన్మయ్ తల అందులో ఇరుక్కుపోయింది.కుటుంబ సభ్యులు ప్రయత్నించినా తల బయటకు తీయలేకపోయారు.
బిందెలో ఇరుక్కున్న బాలుడుడిని మల్కాన్‌గిరి ఫైర్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఫైర్ సిబ్బంది హైడ్రాలిక్ కాంబి టూల్ ఉపయోగించారు. చాలా జాగ్రత్తగా బిందెను కట్టర్‌తో తొలగించారు. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసారు. ఈ సమయంలో ప్రజలు హరిబోల్,జై జగన్నాథ్ అంటూ నినాదాలు చేశారు. ఫైర్ సిబ్బంది ధైర్యంగా, నైపుణ్యంగా వ్యవహరించినందుకు వారిని అభినందించారు.