అమెరికాను వణికించిన భూకంపం.. సునామీ హెచ్చరిక! | Tsunami Warning Issued After USA Alaska Hits Earthquake With Magnitude Of 7.3, Watch Video Inside | Sakshi
Sakshi News home page

అమెరికాను వణికించిన భూకంపం.. సునామీ హెచ్చరిక!

Jul 17 2025 7:22 AM | Updated on Jul 17 2025 9:15 AM

USA Alaska Hits Earthquake And Tsunami

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలోని అలస్కా సముద్ర తీరం భారీ భూకంపం కారణంగా వణికిపోయింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.3గా నమోదు అయినట్టు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే గుర్తించింది. అలాగే, సునామీ హెచ్చరికలు సైతం జారీ చేసింది. దీంతో, అధికారులు అప్రమత్తమన్నారు. ఇక, భూకంపానికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. 

వివరాల ప్రకారం.. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.37 గంటలకు అలస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.3 తీవ్రతగా దీన్ని గుర్తించారు. 20.కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. స్యాండ్‌ పాయింట్‌ సిటీకి 87 కి.మీ దూరంలో దీని ఎపీసెంటర్‌ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. ముందస్తు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు.

 

మరోవైపు.. యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ అలస్కా, అలస్కా పెనిన్‌సులా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. గంట తర్వాత హెచ్చరికలను విరమించుకున్నారు. భూకంపాలు తరుచుగా వచ్చే పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ ప్రాంతంలో అలస్కా ఉంది. 1964 ఉత్తర అమెరికా ప్రాంతంలో 9.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక, 2023లో కూడా అలస్కాలో భూమి కంపించింది. అప్పుడు 7.2 తీవ్రతతో భూమి కంపించడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement