
స్పష్టంచేసిన ట్రంప్ సర్కార్
వాషింగ్టన్: అమెరికా వీసా దక్కడం అనేది చట్టబ ద్ధమైన హక్కు కాదని, అది కేవలం అమెరికాలోకి అడుగుపెట్టేందుకు అర్హత మాత్రమేనని ట్రంప్ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. వీసా దర ఖాస్తులదారులను హెచ్చరిస్తూ ఇప్పటికే పలు మార్లు పలురకాల అడ్వైజరీలు జారీచేసిన ట్రంప్ సర్కార్ తాజాగా మరో ప్రకటనను విడుదలచేసింది.
దరఖాస్తుదారుల సామాజికమాధ్యమ ఖాతాల్లో గత వ్యాఖ్యానాలు, వీడియోలు, పోస్ట్‌లను జల్లెడపట్టి వెతికిమరీ అప్లికేషన్లను ప్రభుత్వం బుట్ట దాఖలుచేయడం తెల్సిందే. తాజాగా వీసా పొంది అమెరికా గడ్డపై అడుగుపెట్టాక చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వీసాను వెంటనే రద్దుచేసి, బహిష్కరించి బలవంతంగా స్వదేశానికి పంపుతామని ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ అమెరికాలో ఉంటూ ఇతరులపై దాడికి పాల్పడటం, గృహ హింస, ఇతర తీవ్రమైన నేరాలకు పాల్పడితే వెంటనే వీసా గడువును రద్దుచేసి దేశం నుంచి బహిష్కరిస్తాం.
భవిష్యత్తులో మరోసారి అమెరికాకు రాకుండా శాశ్వతంగా నిషేధిస్తాం. మీరు అతిక్రమిస్తే ప్రభుత్వం సైతం వీసా గడువును ముగించి మిమ్మల్ని దేశం నుంచి వెళ్లగొడుతుంది’’ అని అమెరికా విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో స్పష్టంచేసింది. ‘‘వీసా పొందిన మీరు చట్టబద్ధంగా అమెరి కాలో ఉండేందుకు అర్హులు. ఆ సువర్ణావకాశాన్ని ఒక్క తప్పుతో చేజార్చుకోకండి. ఒక్క చిన్న నేరం చేసినా మీరు వీసా విషయంలో శాశ్వత విపరి ణామాలను చవిచూడాల్సి ఉంటుంది. ఇక్కడికొచ్చే ప్రతి ఒక్క సందర్శకుడు మా చట్టాల ను గౌరవించి తీరాల్సిందే’’ అని విదేశాంగ శాఖ స్పష్టంచేసింది.