అలస్కాలో భూకంపం | Strongest Ever Earthquake Rattles Northern Alaska | Sakshi
Sakshi News home page

అలస్కాలో భూకంపం

Aug 13 2018 8:40 AM | Updated on Apr 4 2019 3:25 PM

Strongest Ever Earthquake Rattles Northern Alaska - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రిక్టర్‌ స్కేలుపై భూకంపతీవ్రంత 6.4గా నమోదైంది

వాషింగ్టన్‌: అగ్ర రాజ్యం అమెరికాలోని ఉత్తర అలస్కా ప్రాంతంలో అక్కడి కాలమానం ప్రకారం ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంపతీవ్రంత 6.4గా నమోదైంది. ఈ విషయాన్ని యూఎస్‌ జియోగ్రాఫికల్‌ సర్వే ధృవీకరించింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు ఇంకా సమాచారం అందలేదు.

ఇంత తీవ్రతతో భూకంపం  సంభవించడం ఈ ప్రాంతంలో ఇదే మొదటిసారి. 1995లో వచ్చిన భూకంపమే(5.2 మాగ్నిట్యూడ్‌) ఇప్పటి వరకు అత్యంత తీవ్రమైన భూకంపమని అధికారులు చెబుతున్నారు. భూకంపం సంభవించిన తర్వాత పలుమార్లు ప్రకంపనలు కూడా వచ్చాయని జియోగ్రాఫికల్‌ సర్వే అధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement