quetta
-
భారత్‌తో టెన్షన్ వేళ పాక్‌కు షాక్.. ఊహించని దెబ్బకొట్టిన బీఏల్ఏ
క్వెట్టా: పహల్గాం ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ దాయాది దేశానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ సైన్యానికి బలోచ్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఊహించని షాక్ తగిలింది. పాక్ సైన్యానికి సవాల్ విసురుతూ కీలకమైన మంగుచోర్ పట్టణాన్ని బీఎల్ఏ స్వాధీనం చేసుకుంది. ఇదే సమయంలో సైనిక, ప్రభుత్వ అధికారులను సైతం బందీలుగా పట్టుకుంది. అలాగే, బీఎల్ఏ బలగాలు.. క్వెట్టా నగరం దిశగా వెళ్తున్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యాన్ని టార్గెట్ చేసిన బీఎల్ఏ దాడులు చేసింది. ఇక, తాజాగా పాక్ సైన్యంపై తిరుగుబాటు చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యంపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ సవాల్ విసిరింది. కీలకమైన మంగుచోర్ పట్టణాన్ని బీఎల్ఏ స్వాధీనం చేసుకుంది. బీఎల్ఏకు చెందిన అత్యంత క్రూరమైన, ప్రత్యేక శిక్షణ పొందిన 'డెత్ స్క్వాడ్' బృందం ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ బృందం మంగుచోర్ పట్టణంలోకి చొచ్చుకెళ్లి, అక్కడ ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను, భద్రతా సంస్థల ప్రాంగణాలను తమ అదుపులోకి తీసుకుంది. ఇంతటితో ఆగకుండా, పట్టణంలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉన్నత స్థాయి సైనిక, ప్రభుత్వ అధికారులను సైతం బందీలుగా చేసుకుంది.బలుచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని బీఎల్ఏ పోరాడుతోంది. ఈ క్రమంలో బీఎల్ఏ వరుస దాడులతో బలూచిస్తాన్‌పై పాకిస్తాన్ నియంత్రణ కోల్పోతోంది. ఇక, ఇప్పటికే బీఎల్ఏ దాడుల్లో వందలాదిమంది పాక్ సైనికులు మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం పాక్ సైనికులు వెళుతున్న ట్రైన్‌ని హైజాక్ చేసిన బీఎల్ఏ.. పాక్ సైనికులను హతమార్చింది. కొద్ది రోజుల క్రితం బీఎల్ఏ పాక్ సైన్యం కాన్వాయ్‌పై ఐఈడీ దాడి చేయడంతో ఏకంగా 10 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వారు ఎంత దూకుడుగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నారో పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నారు.Baloch sarmachars are roaming openly through Mangocher city, seizing control of banks, as well as government and military assets. Certain handles suggest that government personnel have been forced to evacuate, and that several state institutions are no longer operational.… https://t.co/h9KewE0JZc pic.twitter.com/P4mdw3l6aG— Char (@cqc_coffee_guns) May 3, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌లోని నైరుతి ప్రాంతమే బలూచిస్తాన్. ఇది పాక్‌లో ఒక ప్రావిన్స్‌గా ఉంది. పాకిస్తాన్ మొత్తం విస్తీర్ణంలో 44 శాతం బలూచిస్తాన్ ఉంటుంది. విస్తీర్ణంపరంగా పాకిస్థాన్‌లో అతి పెద్ద ప్రావిన్స్‌గా బలూచిస్తాన్ ఉంది. అలాగే మిగతా అన్ని ప్రావిన్స్‌లో కెల్లా అతి తక్కువ జనాభా ఉన్న ప్రావిన్స్ కూడా బలూచిస్తానే. బలూచిస్తాన్‌లో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు వనరులు పుష్కలంగా ఉన్నాయి. బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయకముందువరకు బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగానే ఉండేది. బ్రిటిష్ వారి నుంచి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ విభజన తర్వాత పాకిస్తాన్లో భాగమైంది. ఆ తర్వాత కొంత కాలానికి స్వతంత్ర దేశం కోసం బలూచిస్తాన్ నుంచి డిమాండ్ పుట్టుకొచ్చింది.అలాగే ఆ ప్రావిన్స్‌లో పాక్ సాగిస్తున్న మారణకాండ కూడా తిరుగుబాటుకు మరో కారణం. 2011 నుంచి 2024 జనవరి వరకు పాక్‌లో మొత్తం 10,078 మంది అదృశ్యం అయ్యారు. అదృశ్యమైనవారిలో 2,752 మంది బలూచ్ పౌరులే. 2001-2017 మధ్య 5,228 మంది బలూచ్ పౌరులు అదృశ్యం కావడం గమనార్హం. ప్రస్తుతం బీఎల్ఏ యాక్టివ్‌గా వేర్పాటువాద కార్యకలాపాలు సాగిస్తోంది. బలూచిస్తాన్ స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్‌తో బీఎల్ఏ ఏర్పాటైంది. దశాబ్ద కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తోంది. -
Pakistan: జెండాలు విక్రయిస్తున్న దుకాణంపై ఉగ్రదాడి.. ముగ్గురు మృతి
పాకిస్తాన్ ఈరోజు(ఆగస్టు 14)న 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటోంది. అయితే ఈ సమయంలోనూ పాక్‌లో విషాదం చోటుచేసుకుంది. కొందరు ఉగ్రవాదులు బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో జాతీయ జెండాలు విక్రయిస్తున్న దుకాణంతో పాటు ఒక ఇంటిపై గ్రెనేడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి.బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో జరిగిన ఈ దాడికి తామే బాధ్యులమంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం ఈ గ్రూప్ జాతీయ జెండాలను విక్రయించవద్దని, ఆగస్టు 14న సెలవుదినాన్ని జరుపుకోవద్దని దుకాణాల యజమానులను హెచ్చరించింది. కాగా ఈ దాడిలో గాయపడిన ఆరుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.కాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిలిటరీ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ సహకారం అందించాలన్నారు. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దాడులు తీవ్రమయ్యాయి. 2022, 2023లలో కూడా పాక్ జెండాలను విక్రయిస్తున్న దుకాణాలపై దాడులు జరిగాయి. -
పాక్‌లో కాంగో వైరస్ కలకలం
పాకిస్తాన్లో కాంగో వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా క్వెట్టాలో మరో కేసు నమోదైంది. 32 ఏళ్ల ఫాతిమా జిన్నా.. కాంగో వైరస్ బారిన పడి ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఏఆర్వై న్యూస్ పాకిస్తాన్లో వ్యాప్తిచెందుతున్న కాంగో వైరస్ కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.ఈ ఏడాది ఇప్పటివరకు పాకిస్తాన్లో 13 కాంగో వైరస్ కేసులు నమోదయ్యాయి. పెషావర్‌లో కాంగో వైరస్ బారిన పడిన 18 ఏళ్ల యువకుడు మృతిచెందాడు. అయితే అతనితో పరిచయం కలిగినవారికి వైరస్ సోకిందీ లేనిదీ తెలియరాలేదు. ఈ వ్యాధి టిక్-బర్న్ నైరో వైరస్ వల్ల వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ పశువులు, మేకలు, గొర్రెలు, కుందేళ్లు తదితర జంతువుల ద్వారా వ్యాపిస్తుంది.కాంగో వైరస్ లక్షణాలివే..జ్వరం, కండరాల నొప్పి, తల తిరగడం, మెడ నొప్పి, వెన్నునొప్పి, కళ్లు మండటం, ఫోటోఫోబియా, వికారం, వాంతులు, అతిసారం, కడుపు నొప్పి, గొంతు నొప్పి మొదలైనవి కాంగో వైరస్ లక్షణాలు. -
క్వెట్టాలో బాంబుపేలుడు, ఆరుగురు మృతి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని క్వెట్టా ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు మృతిచెందగా.. 8 మంది గాయపడ్డారు. క్వెట్టా-సిబ్బి రహదారి సరియల్ మిల్లు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 35 మంది పోలీసులు వెళ్తున్న వాహనం లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, భద్రతా సిబ్బంది క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఏ ఉగ్రసంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. క్వెట్టాలో భద్రతాబలగాలపై దాడులు ఇటీవలికాలంలో ఎక్కువయిపోయాయి. ఆగస్టు 13న మిలటరీ వాహనం లక్ష్యంగా ముష్కరులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో 15 మంది మృతి చెందారు. జూన్ 14న జరిగిన మరో ఆత్మాహుతి దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. -
400 మంది ఉగ్రవాదుల లొంగుబాటు!
ఇస్లామాబాద్: సుమారు 400 మంది ఉగ్రవాదులు తమ ఆయుధాలను వదిలేసి జనజీవనస్రవంతిలో కలిసిపోయారు. పాక్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని నగరం క్వెట్టాలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదులు ఆయుధాలను వదిలేసి లొంగిపోయిన నేపథ్యంలో బలూచిస్తాన్ అసెంబ్లీలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. బలూచిస్తాన్ ముఖ్యమంత్రి నవాబ్ సనావుల్లా జెహ్రీ, సినియర్ ఆర్మీ అధికారులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెహ్రీ మాట్లాడుతూ.. ఉగ్రవాదులను జనజీవన స్రవంతిలో కలపడానికి అవసరమైన అన్నిచర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. అమాయక ప్రజలను చంపడానికి ఉగ్రవాదులు బలూచ్ ప్రావిన్స్‌లోని అమాయక ప్రజలను ఉపయోగించుకుంటున్నారని ఆయన అన్నారు. లొంగిపోయిన ఉగ్రవాదుల్లో బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ, బలూచ్ లిబరేషన్ ఆర్మీతో పాటు పలు సంస్థలకు చెందిన వారు ఉన్నారని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. -
'అది భస్మాసుర హస్తం.. మీకే డేంజర్'
-
'అది భస్మాసుర హస్తం.. మీకే డేంజర్'
హైదరాబాద్: పాకిస్థాన్‌లోని క్వెట్టాలో పోలీస్ అకాడమీపై ఉగ్రవాదులు దాడులు చేయడాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఖండించారు. 61మంది అమాయకులు బలయ్యారని అన్నారు. ఇప్పటికైనా పాకిస్థాన్ ఉగ్రవాదం విషయంలో వాస్తవాలు గ్రహించాలని, ఉగ్రవాదాన్ని దేశ విధానంగా కొనసాగించడం సాక్షాత్తు ఆత్మహత్యా సాదృశ్యమే అని చెప్పారు. 'ఉగ్రవాదం అనేది భస్మాసుర హస్తం. భస్మాసూరుడికి మీరు(పాక్) అవకాశం ఇస్తే చివరికి అది మిమ్మల్నే అంతం చేస్తుంది. మీరు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే.. దాని బాధితులుగా మిగిలిపోతారు' అని వెంకయ్య హెచ్చరించారు. పాక్ ఉగ్రవాదాన్ని ఒక పాలసీగానే కాకుండా భారత్‌కు వ్యతిరేకంగా పెంచిపోషిస్తోందని అన్నారు. నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, పర్వేజ్ ముషార్రఫ్ ల మధ్య ఆగ్రా సమావేశం జరిగిందని, అందులో పాక్ తమ భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతించదని హామీ ఇచ్చిందని, కానీ దానిని నిలబెట్టుకోవడంలో పాక్ విఫలమైందని మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం పాక్ నడుచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పాక్‌లో ఉగ్రదాడి : 60 మంది పోలీసులు మృతి
-
పాక్‌లో ఉగ్రదాడి : 59 మంది పోలీసులు మృతి
-
పాక్‌లో ఉగ్రదాడి : 59 మంది పోలీసులు మృతి
క్వెట్టా: పాకిస్తాన్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. క్వెట్టాలోని పోలీసుల శిక్షణా శిబిరంపై ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆత్మాహుతి జాకెట్లతో శిక్షణా శిబిరంలోకి ప్రవేశించి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దాదాపు 59 మంది పోలీసులు దుర్మరణం చెందగా... పలువురు తీవ్రంగా గాయపడినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. ఉగ్రవాదులు ముందుగా వాచ్ టవర్ సెంట్రీని లక్ష్యంగా చేసుకుని దాడులకు యత్నించారనీ, ఆ తరువాత శిక్షణా శిబిరంలోకి ప్రవేశించారని పేర్కొంది. ఈ దాడి సమయంలో పోలీసుల శిక్షణా శిబిరంలో 600మంది ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంది. భద్రతా సిబ్బంది 250 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కాగా, కొంతమంది పోలీసులు ఉగ్రవాదుల వద్ద బందీలుగా ఉన్నట్టు తెలిసింది. పోలీసుల ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయినట్లు పాక్ మీడియా ప్రకటించింది. నిషిద్ధ అల్‌ఖైదాకు అనుబంధంగా ఉండే లష్కరే జంగవి ఉగ్రవాదుల పనేనని అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
పాక్‌కు మళ్లీ షాక్.. చైనాకు ఝలక్
-
పాక్‌కు మళ్లీ షాక్.. చైనాకు ఝలక్
కరాచీ: పాకిస్థాన్‌లో బలూచిస్తాన్ పౌరుల ఉద్యమ పోరు ఉధృతం అవుతోంది. తమకు స్వాతంత్ర్యం ఇవ్వాలంటూ వారు ఆందోళన తీవ్ర తరం చేస్తున్నారు. దీనికి ప్రపంచ దేశాలు మద్దతివ్వాలని అడగడమే కాకుండా తమ ఆకాంక్షను పట్టించుకోకుండా పాక్ తో సంబంధాలు పెట్టుకునే దేశాలకు వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేస్తున్నారు. ఆదివారం పలువురు బలూచిస్తాన్ వాసులు చైనాకు వ్యతిరేకంగా క్వెట్టా ప్రాంతంలో ఆందోళనకు దిగారు. తమ నిరసనలు పట్టించుకోకుండా పాక్ తో ఒప్పందాలకు దిగడం తమ హక్కులను ఉల్లంఘించడమేనంటూ పలువురు బలూచ్ వాసులు పాక్‌కు, చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బలూచిస్తాన్ లో చైనా జోక్యాన్ని తాము సహించబోమంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్వెట్టా అనేది చైనా పాక్ కు మధ్య ఉన్న ఎకనామికల్ కారిడార్. ఈ నేపథ్యంలో తమకు వ్యతిరేకంగా పాక్ తో చేతులు కలపడాన్ని అంగీకరించబోమంటూ వారు నినదిస్తున్నారు. ఇరు దేశాల నేతల దిష్టిబొమ్మలు తగులబెట్టారు. -
బాంబు పేలుడు: పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు
కరాచీ: పాకిస్థాన్ సింధు ప్రావెన్స్లో రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు సంభవించింది. ఆ సమయంలో ట్రాక్‌పై వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 10 మంది రైలు ప్రయాణికులు గాయపడ్డారని పాకిస్థాన్ రైల్వే అధికార ప్రతినిధి వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రావల్పిండి నుంచి క్విట్టాకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు. పేలుడు వల్ల రైల్వే ట్రాక్ ధ్వంసమైందని... సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో పలు రైళ్లను వేరే మార్గంలో నడిపిస్తున్నట్లు వివరించారు. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఏ సంస్థ ప్రకటించలేదు. -
పాకిస్థాన్‌లో తీవ్రవాదుల ఘాతుకం
పాకిస్థాన్‌లోని బెలుచిస్థాన్‌లో కిడ్నాప్‌నకు గురైన 23 మంది ప్రయాణికుల్లో 13 మందిని తీవ్రవాదులు హతమార్చారని మీడియా వెల్లడించింది. మంగళవారం ఉదయం వారి మృతదేహాలను పోలీసులు కనుగోన్నారని తెలిపింది. కాగా మరో 10 మంది ప్రయాణికుల ఆచూకీ ఇంతవరకు తెలియలేదని పేర్కొంది. ఆ ప్రయాణికుల ఆచూకీ వెంటనే కనిపెట్టాలని బెలుచిస్థాన్ ప్రావెన్స్ సీఎం అబ్దుల్ మాలిక్ బెలుచి ఉన్నతాధికారులను ఆదేశించారని చెప్పింది. అలాగే ఆ ఘాతుకానికి ఒడిగట్టిన తీవ్రవాదులను సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలని ఆయన జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారని తెలిపింది. అయితే భద్రతా సిబ్బంది లేకపోవడంతో తీవ్రవాదులు ఆ రెండు బస్సుల్లోని ప్రయాణికులను ఆపి ఈ ఘాతుకానికి ఒడిగట్టారని అధికారులు అభిప్రాయపడతున్నారని పేర్కొంది. సోమవారం అర్థరాత్రి క్విట్టా నుంచి పంజాబ్ ప్రావెన్స్‌కు వెళ్లున్న రెండు బస్సులను భద్రత దళానికి చెందిన దుస్తులు ధరించిన సాయుధ బృందం బలవంతంగా నిలిపివేసింది. అనంతరం ఆ బస్సులోకి ప్రవేశించి ప్రయాణికులు తమ గుర్తింపుకార్డులు చూపించాలని వారు డిమాండ్ చేశారు. ప్రయాణికులందరిని తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. కాగా మంచ్ ప్రాంతంలో ఆ రెండు బస్సులను తీవ్రవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఆ బస్సుల వెంట ఉన్న భద్రత సిబ్బంది తీవ్రవాదుల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో భద్రత సిబ్బంది, తీవ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ భద్రత సిబ్బంది మరణించగా, మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని భద్రత సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు.