పాకిస్థాన్లోని క్వెట్టాలో పోలీస్ అకాడమీపై ఉగ్రవాదులు దాడులు చేయడాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఖండించారు. 61మంది అమాయకులు బలయ్యారని అన్నారు. ఇప్పటికైనా పాకిస్థాన్ ఉగ్రవాదం విషయంలో వాస్తవాలు గ్రహించాలని, ఉగ్రవాదాన్ని దేశ విధానంగా కొనసాగించడం సాక్షాత్తు ఆత్మహత్యా సాదృశ్యమే అని చెప్పారు.