పాకిస్తాన్‌లో బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌ రైలు | Peshawar to Quetta Jaffar Express derailed Near Jacobabad | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌లో బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌ రైలు

Jun 18 2025 1:18 PM | Updated on Jun 18 2025 1:29 PM

Peshawar to Quetta Jaffar Express derailed Near Jacobabad

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్తాన్‌లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. సింధ్‌ ప్రావిన్స్‌లో రైల్వే ట్రాక్‌పై పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు అదుపు తప్పి కింద పడిపోయాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌ సింధ్ ప్రావిన్స్‌లోని జకోబాబాద్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై బుధవారం ఉదయం పేలుళ్లు సంభవించింది. ఈ పేలుడు కారణంగా పాకిస్తాన్‌కు చెందిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని అనేక బోగీలు పట్టాలు తప్పాయి. పేలుడు కారణంగా మూడు అడుగుల మేర గుంత పడినట్లు ధ్రువీకరించిన పోలీసులు. కాగా, సదరు రైలు.. బలూచిస్తాన్‌లోని రెసిడెన్షియల్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నుండి పెషావర్‌కు వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. రైలు ఆగిపోయిన అనంతరం, ప్రయాణీకులు అక్కడి నుంచి వెళ్లిపోతున్న వీడియో వైరల్‌గా మారింది.  

ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ రైల్వేస్‌కు చెందిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ క్వెట్టా నుంచి పెషావర్ మధ్య నడుస్తుంది. దాదాపు 34 గంటల 10 నిమిషాల్లో 1,632 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంటుంది. అయితే, జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలునే ఈ ఏడాది మార్చిలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. క్వెట్టాకు దక్షిణంగా ఉన్న పర్వత ప్రాంతం సమీపంలో వందలాది మంది ప్రయాణికులను బందీలుగా తీసుకున్నారు. పాకిస్తాన్‌ ఆర్మీకి భద్రతా సిబ్బందిని బీఎల్‌ఏ దళాలు హతమార్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement