breaking news
Jaffar Express
-
పాకిస్తాన్లో బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. సింధ్ ప్రావిన్స్‌లో రైల్వే ట్రాక్‌పై పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు అదుపు తప్పి కింద పడిపోయాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్‌లోని జకోబాబాద్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై బుధవారం ఉదయం పేలుళ్లు సంభవించింది. ఈ పేలుడు కారణంగా పాకిస్తాన్‌కు చెందిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని అనేక బోగీలు పట్టాలు తప్పాయి. పేలుడు కారణంగా మూడు అడుగుల మేర గుంత పడినట్లు ధ్రువీకరించిన పోలీసులు. కాగా, సదరు రైలు.. బలూచిస్తాన్‌లోని రెసిడెన్షియల్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నుండి పెషావర్‌కు వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. రైలు ఆగిపోయిన అనంతరం, ప్రయాణీకులు అక్కడి నుంచి వెళ్లిపోతున్న వీడియో వైరల్‌గా మారింది. بلوچستان کے علاقے بولان پمپ کے صدر تھانے کی حدود میں ریلوے ٹریک پر دھماکے کے نتیجے میں جعفر ایکسپریس کی چھ بوگیاں پٹری سے اتر گئیں۔An explosion on the railway track in Balochistan's Bolan Pump area caused six carriages of the Jaffar Express to derail. pic.twitter.com/S9CBiMLknR— Brahag Baluch (@brahagbaluch) June 18, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ రైల్వేస్‌కు చెందిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ క్వెట్టా నుంచి పెషావర్ మధ్య నడుస్తుంది. దాదాపు 34 గంటల 10 నిమిషాల్లో 1,632 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంటుంది. అయితే, జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలునే ఈ ఏడాది మార్చిలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. క్వెట్టాకు దక్షిణంగా ఉన్న పర్వత ప్రాంతం సమీపంలో వందలాది మంది ప్రయాణికులను బందీలుగా తీసుకున్నారు. పాకిస్తాన్ ఆర్మీకి భద్రతా సిబ్బందిని బీఎల్ఏ దళాలు హతమార్చాయి.NEWSFLASH: Four bogies of the Peshawar to Quetta Jaffar Express derailed after an explosion near Jacobabad. No casualties reported. The Jaffar Express was hijacked by terrorists earlier in the year near Sibi. pic.twitter.com/cLQaZREBhM— Khabar Kada (@KhabarKada) June 18, 2025 -
పాక్ చెప్పిందంతా అబద్ధం
ఇస్లామాబాద్: రెండు నెలల క్రితం పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసిన ఉదంతంలో ఆ దేశ ప్రభుత్వం, సైన్యం చెప్పినదంతా అబద్ధమని బలూచిస్తాన్ వేర్పాటువాదుల గ్రూప్ అయిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) సోమవారం ప్రకటించింది. రైలు హైజాక్ ఘటనలో తమదే పైచేయి అని పేర్కొంటూ సాక్ష్యాధారాలతో సవివరంగా ఒక వీడియోను రూపొందించి తాజాగా విడుదలచేసింది. పాకిస్తాన్లో విస్తీర్ణంపరంగా అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ అభివృద్ధిలో ఆమడదూరంలో నిలిచిపోయిన బలూచిస్తాన్ ప్రజలు ఏకమై తమ ప్రాంత స్వయంప్రతిపత్తే లక్ష్యంగా ఉద్యమిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఉద్యమంలో భాగంగా మార్చి 11వ తేదీన పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును వందలాది మంది బలూచ్ సాయుధులు రైలు పట్టాలను పేల్చేశాక హైజాక్ చేయడం తెల్సిందే. అయితే ఈ ఘటనలో బలూచ్ మిలిటెంట్లను హతమార్చి వందల మంది ప్రయాణికులను కాపాడామని పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం ప్రకటించాయి. అయితే అదంతా అబద్ధమంటూ 36 నిమిషాల వీడియోను బలూచ్ ఆర్మీ మీడియా విభాగం హక్కాల్ ఒక వీడియోను బయటపెట్టింది. అందులో దాడికి ముందే సుశిక్షితులైన వందలాది మంది బీఎల్ఏ ఫైటర్లు షూటింగ్ ప్రాక్టీస్ చేయడం, రైలును హైజాక్ చేశాక ఏ బోగీ జనాలను ఎటువైపు తీసుకెళ్లాలి? ఎవరి బాధ్యతలు ఏమిటి? వంటి వాటితోపాటు బందీలకు ఎలాంటి హానీ తలపెట్టకుండా జాగ్రత్తగా రైలు నుంచి దూరంగా తీసుకెళ్లిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. బందీలను చిత్రహింసలకు గురిచేసి కొందరిని చంపేశామన్న పాక్ సైన్యం వాదనల్లో నిజంలేదని బీఎల్ఏ ఈ వీడియోతో నిరూపించింది. బందీల్లో 200 మంది పాక్ పోలీసులు, అధికారులు ఉన్నారు. వాళ్లను రెండు రోజులపాటు బంధించిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. మహిళలు, వృద్ధులు, చిన్నారులను హింసించారన్న వాదనలో వాస్తవం లేదని ఆ వీడియో చూస్తే తెలుస్తోంది. అసలు దాడి చేయడానికి గల కారణాలు, ఆవశ్యకతను బీఎల్ఏ సీనియర్ నేత ఒకరు ఈ వీడియో మొదట్లోనే స్పష్టంచేశారు. ‘‘మా పోరాటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా ఉద్యమం కీలకదశకు చేరుకుంటోంది. ఈ దశలో సంక్షిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచి్చంది. మా యువ ఫైటర్లు ఇలాంటి కఠిన నిర్ణయాలను అమలుచేయాల్సి వచి్చంది. ఇలాంటి నిర్ణయాలుకాకుండా మరే ప్రత్యామ్నాయాలు లేవని మా వాళ్లకూ అర్థమైంది. తుపాకీని నిలువరించాలంటే తుపాకీని పట్టుకోవాల్సిందే. తుపాకీ పేలుడు శబ్దం కూడా కొంత దూరం వరకే వినిపిస్తుంది. తన తండ్రి కోసం తనయుడు ప్రాణత్యానికైనా సిద్ధమయితే అదే కొడుకు కోసం తండ్రి కూడా ఎంతకైనా తెగిస్తాడు’’అని ఆయన చెప్పాడు. హైజాక్ ప్రణాళిక రచన, అమలు, ముందుండి నడిపించి ఫిదాయీ ఫైటర్ యూనిట్ మజీద్ బ్రిగేడ్ వివరాలు, ఫొటోలు, సభ్యుల స్పందనలను వీడియోకు జతచేశారు. పాక్ సైన్యం ప్రతిదాడిచేసినా అత్యల్ప స్థాయిలో తమ వైపు ప్రాణనష్టం జరిగిందంటూ వీరమరణం పొందిన వాళ్లకు నివాళులు అరి్పంచిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. 30 గంటలపాటు సైనిక ఆపరేషన్ తర్వాత 33 మంది రెబల్స్‌ను మట్టుబెట్టామని పాక్ సైన్యం ఆనాడు ప్రకటించింది. బందీలను విడిపించే క్రమంలో 23 మంది జవాన్లు, ముగ్గురు రైల్వే ఉద్యోగులు, ఐదుగురు ప్రయాణికులు చనిపోయారని తెలిపింది. అయితే తాము మాత్రం బందీలుగా ఉన్న 214 మంది పాకిస్తాన్ పోలీసులందరినీ చంపేశామని రెబల్స్ ప్రకటించారు. -
పట్టాలు తప్పిన రైలు: 12 మంది దుర్మరణం
కరాచీ: పాకిస్థాన్‌లో ఉగ్రవాద ప్రభావిత బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో మంగళవారం ఉదయం ఘోర దుర్ఘటన జరిగింది. బెలూచిస్థాన్ రాజధాని క్వెట్టా నుంచి రావల్పిండికి ప్రాయాణిస్తున్న 'జాఫర్ ఎక్స్ ప్రెస్' అబీగుమ్ ప్రాంతంలో పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు చెల్లాచెదురు కావడంతో 12 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో 100 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదంలో రైలు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్లు కూడా చనిపోయారని... సహాయక బృందాలు సంఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నాయని పాకిస్థాన్ రైల్వే మంత్రి సయ్యద్ రఫీక్ చెప్పారు. సహాయ బృందాలకు తోడు సైన్యాన్ని కూడా రంగంలోకి దింపుతున్నట్లు బెలూచిస్థాన్ ప్రావిన్స్ హోం మంత్రి సర్ఫరాజ్ తెలిపారు. కాగా, నవంబర్ 1న ఇదే రైలుపై ఉగ్రవాదులు దాడి జరిపారు. శక్తిమంతమైన బాంబులతో రైలును పేల్చేందుకు ప్రయత్నించారు. నాటి సంఘటనలో నలుగురు చనిపోగా, ఆరుగురికి గాయలయ్యాయి. ఆ తరువాత జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలుకు భద్రత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. అయితే ఈ సంఘటన వెనుక కూడా ఉగ్రవాదుల హస్తమేమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.