టెస్లాకు రూ.2100 కోట్ల జరిమానా: కారణం ఇదే.. | Elon Musk Tesla Ordered To Pay 242 Million Dollars In 2019 Fatal Autopilot Crash | Sakshi
Sakshi News home page

టెస్లాకు రూ.2100 కోట్ల జరిమానా: కారణం ఇదే..

Aug 2 2025 11:28 AM | Updated on Aug 2 2025 12:00 PM

Elon Musk Tesla Ordered To Pay 242 Million Dollars In 2019 Fatal Autopilot Crash

అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు ఫ్లోరిడా కోర్టు భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. 2019లో జరిగిన రోడ్డు ప్రమాదానికి "ఆటోపైలట్" డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీ కారణమని భావించి కోర్టు ఈ జరిమానా విధించింది.

2019లో కీ లార్గోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. నైబెల్ బెనవిడెస్ లియోన్ మరణించగా, ఆమె ప్రియుడు డిల్లాన్ అంగులో గాయపడ్డాడు. ఆ సమయంలో 'జార్జ్ మెక్‌గీ' టెస్లా కారు నడుపుతున్నాడు. ఆటోపైలట్ ఫీచర్ (టెస్లా కార్లలోని ఒక ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టం) ఆన్ చేసి ప్రయాణిస్తున్న సమయంలో.. తన ఫోన్ అనుకోకుండా కారులోనే కింద పడింది. ఆ సమయంలో వంగి ఫోన్ తీసుకున్న సమయంలో కారు రోడ్దుపై ఉన్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనపై బాధితులు కోర్టును ఆశ్రయించారు.

ఈ ఘటనపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు.. ఎట్టకేలకు తీర్పునిస్తూ 329 మిలియన్ డాలర్లు పరిగహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఇందులో 242 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,100 కోట్లు) టెస్లా చెల్లించాలని.. మిగిలిన మొత్తాన్ని డ్రైవర్ ఇవ్వాలని పేర్కొంది. ఈ తీర్పుపై టెస్లా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ తీర్పుపై అప్పీల్ చేయనున్నట్లు సంస్థ యాజమాన్యం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement