'అది భస్మాసుర హస్తం.. మీకే డేంజర్' | Pak uses terrorism as State policy which is suicidal: Naidu | Sakshi
Sakshi News home page

'అది భస్మాసుర హస్తం.. మీకే డేంజర్'

Oct 26 2016 4:31 PM | Updated on Sep 4 2017 6:23 PM

'అది భస్మాసుర హస్తం.. మీకే డేంజర్'

'అది భస్మాసుర హస్తం.. మీకే డేంజర్'

పాకిస్థాన్లోని క్వెట్టాలో పోలీస్ అకాడమీపై ఉగ్రవాదులు దాడులు చేయడాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఖండించారు.

హైదరాబాద్: పాకిస్థాన్లోని క్వెట్టాలో పోలీస్ అకాడమీపై ఉగ్రవాదులు దాడులు చేయడాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఖండించారు. 61మంది అమాయకులు బలయ్యారని అన్నారు. ఇప్పటికైనా పాకిస్థాన్ ఉగ్రవాదం విషయంలో వాస్తవాలు గ్రహించాలని, ఉగ్రవాదాన్ని దేశ విధానంగా కొనసాగించడం సాక్షాత్తు ఆత్మహత్యా సాదృశ్యమే అని చెప్పారు.

'ఉగ్రవాదం అనేది భస్మాసుర హస్తం. భస్మాసూరుడికి మీరు(పాక్) అవకాశం ఇస్తే చివరికి అది మిమ్మల్నే అంతం చేస్తుంది. మీరు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే.. దాని బాధితులుగా మిగిలిపోతారు' అని వెంకయ్య హెచ్చరించారు. పాక్ ఉగ్రవాదాన్ని ఒక పాలసీగానే కాకుండా భారత్కు వ్యతిరేకంగా పెంచిపోషిస్తోందని అన్నారు. నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, పర్వేజ్ ముషార్రఫ్ ల మధ్య ఆగ్రా సమావేశం జరిగిందని, అందులో పాక్ తమ భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతించదని హామీ ఇచ్చిందని, కానీ దానిని నిలబెట్టుకోవడంలో పాక్ విఫలమైందని మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం పాక్ నడుచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement