రంజీ ట్రోఫీ 2025-26 ఎడిషన్‌లో కర్ణాటక ఆటగాడు కరుణ్ నాయర్ సూపర్ ఫామ్‌ను కొనసాగించాడు. తొలి మ్యాచ్‌లో సౌరాష్ట్రపై హాఫ్ సెంచరీ (73), రెండో మ్యాచ్‌లో గోవాపై భారీ సెంచరీ (174 నాటౌట్) చేసిన అతడు.. తాజాగా కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా డబుల్ సెంచరీతో (233) చెలరేగాడు.
ఇదే ఇన్నింగ్స్‌లో మరో కర్ణాటక ఆటగాడు స్మరణ్ రవిచంద్రన్ (171 నాటౌట్) కూడా డబుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు.
కరుణ్, స్మరణ్ చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న కర్ణాటక భారీ స్కోర్ (514/4) చేసింది. స్మరణ్‌తో పాటు అభినవ్ మనోహర్ (15) క్రీజ్‌లో ఉన్నాడు. కృష్ణణ్ శ్రీజిత్ (65) అర్ద సెంచరీతో రాణించాడు. బాసిల్ 2, నిధీష్, బాబా అపరాజిత్ తలో వికెట్ తీశారు. ప్రస్తుతం మ్యాచ్ రెండో రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది.
చదవండి: PAK Vs SA: రాణించిన బాబర్, అఫ్రిది.. పాకిస్తాన్‌దే టీ20 సిరీస్


