ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ.. అయినా పృథ్వీ షాకు తప్పని భంగపాటు! | Prithvi Shaw smashes 222 in Ranji Trophy; Ruturaj shares Player of the Match award | Sakshi
Sakshi News home page

ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ.. పృథ్వీ షాకు మొండిచేయి! రుతు ఏం చేశాడంటే..

Oct 29 2025 12:41 PM | Updated on Oct 29 2025 1:10 PM

Prithvi Shaw Not Given POTM Award Despite Double Ton CSK Star Does This

రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌తో మహారాష్ట్రతో తన ప్రయాణం మొదలుపెట్టాడు టీమిండియా క్రికెటర్‌ పృథ్వీ షా (Prithvi Shaw). తొలుత కేరళతో జరిగిన మ్యాచ్‌లో డకౌట్‌ అయినా.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం (75)తో సత్తా చాటాడు. తాజాగా చండీగఢ్‌తో మ్యాచ్‌లో మాత్రం పృథ్వీ షా విశ్వరూపం ప్రదర్శించాడు.

 ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ
చండీగఢ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే పృథ్వీ పరిమితమయ్యాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడి మహారాష్ట్ర విజయంలో కీలక పాత్ర పోషించాడు. 141 బంతుల్లోనే డబుల్‌ సెంచరీ బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. రంజీ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ (Fastest Double Century) నమోదు చేశాడు.

పృథ్వీ షాకు భంగపాటు!
మొత్తంగా 156 బంతుల్లో 222 పరుగులు సాధించిన పృథ్వీ షా.. ఇన్నింగ్స్‌లో 29 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే, అర్జున్‌ ఆజాద్‌ బౌలింగ్‌లో నిషాంక్‌ బిర్లాకు క్యాచ్‌ ఇవ్వడంతో పృథ్వీ షా ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఏదేమైనా డబుల్‌ సెంచరీతో సత్తా చాటిన పృథ్వీ షాను ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు వరిస్తుందని అంతా భావించారు.

పృథ్వీ షాకు రుతురాజ్‌ సర్‌ప్రైజ్‌
అయితే, పృథ్వీని కాదని.. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (163 బంతుల్లో 116) సాధించిన రుతురాజ్‌ గైక్వాడ్‌కు ఈ బహుమానం దక్కింది. ఈ నేపథ్యంలో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న రుతు.. పృథ్వీకి స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. పృథ్వీని దగ్గరికి పిలిచి అతడితో కలిసి అవార్డును పంచుకున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. సమిష్టి కృషి, పరస్పర గౌరవం, క్రీడాస్ఫూర్తికి ఇది నిదర్శనం అంటూ హర్షం వ్యక్తం చేసింది. కాగా ఎలైట్‌ గ్రూప్‌-బిలో భాగంగా చండీగఢ్‌పై మహారాష్ట్ర 144 పరుగుల తేడాతో విజయం సాధించింది.

చండీగఢ్‌ వర్సెస్‌ మహారాష్ట్ర సంక్షిప్త స్కోర్లు
👉మహారాష్ట్ర: 313 & 359/3 డిక్లేర్డ్‌
👉చండీగఢ్‌ : 209 &319
👉ఫలితం: చండీగఢ్‌పై 144 పరుగుల తేడాతో మహారాష్ట్ర గెలుపు.. మహారాష్ట్రకు ఆరు పాయింట్లు.

చదవండి: నేను మాట్లాడితే కథ వేరేలా మారుతుంది.. సెలక్టర్‌ జోక్యంతో షమీ యూటర్న్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement