
రంజీ ట్రోఫీ 2025-26 ఎలైట్ గ్రూపులో భాగంగా నెక్స్‌జెన్ క్రికెట్ గ్రౌండ్(తూముకొండ) వేదికగా హైదరాబాద్, ఢిల్లీ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ(Tilak varma) తీవ్ర నిరాశపరిచాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్.. రెండు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.
ఢిల్లీ కెప్టెన్ అయూష్ బదోని బౌలింగ్‌లో వికెట్ల ముందు ఆసియాకప్ హీరో దొరికిపోయాడు. తిలక్ విఫలమైనప్పటికి హైదరాబాద్ బ్యాటర్లు ఢిల్లీకి ధీటైన జవాబు ఇస్తున్నారు. 50 ఓవర్లు ముగిసే హైదరాబాద్ మూడు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. క్రీజులో తన్మయ్ అగర్వాల్(90), హిమతేజ(7) ఉన్నారు. అంతకముందు అంకిత్ రెడ్డి(87), రాహుల్ సింగ్(35) రాణించారు. హైదరాబాద్ ప్రస్తుతం ఢిల్లీ కంటే 306 పరుగులు వెనుకబడి ఉంది.
సాంగ్వాన్, దొసెజా డబుల్ సెంచరీలు..
ఇక మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ తమ తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 529 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 256/3తో ఆట కొనసాగించిన జట్టు గురువారం మరో 68 ఓవర్లు ఆడి 273 పరుగులు జోడించింది. ఢిల్లీ బ్యాటర్లలో సనత్ సాంగ్వాన్ (470 బంతుల్లో 211 నాటౌట్; 21 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఆయుశ్ దొసెజా (279 బంతుల్లో 209; 25 ఫోర్లు, 5 సిక్స్‌లు) డబుల్ సెంచరీలతో సత్తాచాటారు.
చదవండి: పాకిస్తాన్ టీమ్‌కు కొత్త కెప్టెన్!?