రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో విజయం
తిప్పేసిన సౌరభ్, విజయ్ ∙అభిషేక్ రెడ్డి, కరణ్ అర్ధ సెంచరీలు
సాక్షి, విశాఖపట్నం: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో పటిష్టమైన తమిళనాడు జట్టుపై తమ అజేయ రికార్డును ఆంధ్ర జట్టు నిలబెట్టుకుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా తమిళనాడుతో జరిగిన జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ సీజన్‌లో ఆంధ్ర జట్టుకిది వరుసగా రెండో విజయం కావడం విశేషం. రంజీ ట్రోఫీలో ఆంధ్ర, తమిళనాడు జట్లు ఎనిమిదిసార్లు ముఖా ముఖిగా తలపడ్డాయి.
నాలుగు మ్యాచ్‌ల్లో ఆంధ్ర నెగ్గగా... మరో నాలుగు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగి శాయి. తమిళనాడుతో పోరులో మొదట ఆంధ్ర బౌలర్లు, లక్ష్యఛేదనలో బ్యాటర్లు సత్తా చాటారు. సోమవారం ఆటలో 7 వికెట్లు పడగొట్టిన ఆంధ్ర... బ్యాటింగ్‌లో 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి మూడే రోజుల్లో మ్యాచ్‌ను ముగించింది. ఓవర్‌నైట్ స్కోరు 102/3తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన తమిళనాడు 70.3 ఓవర్లలో 195 పరుగులకే కుప్పకూలింది. సౌరభ్ (4/46), విజయ్ (2/16), పృథీ్వరాజ్ (2/31) తమిళ నాడును దెబ్బ కొట్టారు.
తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగుల ఆధిక్యం ఉన్న తమిళనాడు జట్టు... ఆంధ్ర ముందు 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆంధ్ర 41.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. అభిõÙక్ రెడ్డి (70; 11 ఫోర్లు), కరణ్ షిండే (51; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. ఆంధ్ర స్వల్ప వ్యవధిలో 4 వికెట్లను కోల్పోయినా... అశ్విన్ హెబ్బర్ (21 నాటౌట్; 2 ఫోర్లు), సత్యనారాయణ రాజు (20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. ఈ నెల 16 నుంచి జంషెడ్‌పూర్‌లో జరిగే తదుపరి మ్యాచ్‌లో జార్ఖండ్‌తో ఆంధ్ర ఆడుతుంది.


